
ప్రొసీడింగ్ ఇచ్చి వదిలేశారు
మాది మల్లాపూర్ మండలం కొత్తదాంరాజ్‌పల్లి. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పైలెట్ ప్రాజెక్టుగా ఎంపికై ంది. నా భార్య గడ్డం ప్రియాంకను లబ్దిదారుగా ఎంపిక చేసి ఇందిరమ్మ ఇల్లు మంజూరు పత్రం కూడా ఇచ్చారు. ముగ్గు పోసి ఇల్లు మొదలు పెడదామనుకుంటే ఆన్‌లైన్‌లో సమస్య అంటూ పని మొదలు కానివ్వడం లేదు. గ్రామ కార్యదర్శిని విచారించగా ఆన్‌లైన్‌లో ఇబ్బందులు ఉన్నాయని చెబుతున్నారు. మా ఇంటి నిర్మాణం ప్రారంభించేలా అదికారులను ఆదేశించి న్యాయం చేయండి.
– గడ్డం నరేశ్, కొత్తదాంరాజ్‌పల్లి