
గుడి కబ్జాను నియంత్రించండి
మాది కొడిమ్యాల మండలం రామకిష్టాపూర్. గ్రామంలోని పోరంబోకు భూమిలో ఉన్న పెద్దమ్మతల్లి గుడిలో 70 ఏళ్లకు పైగా పూజలు చేస్తున్నాం. గుడితో పాటు గుడికి సంబంధించిన 19 గుంటల భూమిని శోభన్ కుటుంబం కబ్జా చేసి రేకుల షెడ్డు వేసుకొని పశువుల పా కగా వినియోగిస్తున్నాడు. ఇదేమని ప్రశ్నిస్తే ప్ర భుత్వ (పోరంబోకు) భూమి తన పేరన రిజి స్ట్రేషన్ కూడా జరిగిందని చెబుతున్నాడు. భూమి కబ్జాకు పాల్పడిన శోభన్ కుటుంబసభ్యులపై చర్యలు తీసుకుని న్యాయం చేయండి.
– రామకిష్టాపూర్ గ్రామ ముదిరాజ్ కులస్తులు