
కేడీసీసీబీలో భారీగా బదిలీలు
కరీంనగర్ అర్బన్: కేడీసీసీబీలో భారీగా బదిలీలు జరిగాయి. సెక్రటరీలు, స్టాఫ్ అసిస్టెంట్లకు స్థానచలనం కల్పిస్తూ డీఎల్‌ఈసీ ఉత్తర్వులు జారీ చేసింది. 131 ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలకు గానూ బదిలీలు నిర్వహించగా తక్షణమే విధుల్లో చేరాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. గొండ రామయ్య(గట్టుదుద్దెనపల్లి)ను పోరండ్ల ప్యాక్స్ సెక్రటరీగా బదిలీ చేయగా కలం నర్సయ్య(చిగురుమామిడి)ను అక్కడే నియమించగా కడారి మల్లేశం(రామడుగు)ను కొక్కెరకుంట, పాకాల లక్ష్మారెడ్డి(మానకొండూరు)ను ఊటూరు, మహ్మద్ సర్ఫరాజ్ హుస్సేన్(తుమ్మనపల్లి)ను హుజూరాబాద్, శనిగరపు సదయ్య(మెట్‌పల్లి)ను మానకొండూరు, కల్లెం తిరుపతిరెడ్డి(చొప్పదండి)ని అక్కడే నియమించారు. పోతర్ల శ్రీనివాస్(గద్దపాక)ను ధర్మారం, మిట్టపల్లి రవీందర్(ఊటూరు)ను ఎల్కతుర్తి, చీకటి కుమారస్వామి(ఆర్నకొండ)ని కరీంనగర్, గొల్లె రామయ్య(కొక్కెరకుంట)ను ఆర్నకొండ, మేకల రమేష్(కరీంనగర్)ను దుర్శేడ్, గాలిపల్లి రమేష్(గంగాధర)ను కురిక్యాల, కసిరెడ్డి మల్లిఖార్జున్‌రెడ్డి(దేవంపల్లి)ని గట్టుదుద్దెనపల్లి, చెల్మల మల్లారెడ్డి (వెన్నంపల్లి)ని దేవంపల్లి, గాజుల ప్రభాకర్(కురిక్యాల)ను గంగాధర, చింతలపల్లి ఆదిత్య (ఇల్లందకుంట)ను వీణవంక, గుర్రం ఆంజనేయులు(నుస్తులాపూర్)ను పోరండ్ల, గోస్కుల వివేకానంద(హుజూరాబాద్)ను వెన్నంపల్లి, చందుపట్ల ప్రకాష్‌రెడ్డి(వీణవంక)ని సైదాపూర్, చెనవేసి శ్రీధర్(సైదాపూర్)ను కమలాపూర్, జి.శ్రీనివాస్(ధర్మారం)ను తనుగుల, జి.శ్రీనివాస్(తనుగుల)ను ఇల్లందకుంటకు బదిలీ చేశారు.
● ఉమ్మడి జిల్లావ్యాప్తంగా స్థానచలనం
అసమర్థ పాలనతో రైతులకు ఇబ్బందులు
గొల్లపల్లి: రాష్ట్రంలో అసమర్థ కాంగ్రెస్ పాలనతో రైతులు యూరియా కో సం తీవ్ర ఇబ్బంది పడుతున్నారని బీఆర్‌ఎస్ మండల నాయకులు అన్నారు. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు.. మాజీమంత్రి కొప్పుల ఈశ్వర్ ఆదేశాలతో పార్టీ ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. పాలకులు స్పందించి రైతుల ందరికీ ఇబ్బంది లేకుండా చూడాలని డిమాండ్ చేశారు. లేకుంటే రైతుల పక్షాన బీఆర్‌ఎస్ పోరాడుతుందన్నారు. పా ర్టీ మండల అధ్యక్షుడు గోస్కుల జలంధర్, కో–ఆర్డినేటర్ బోయపోతు గంగాధర్, ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
యూరియా అందించకపోవడం దారుణం
ధర్మపురి: రైతులకు సరిపడా యూరియా అందించకపోవడం ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనమని బీఆర్‌ఎస్ మండల నాయకులు అన్నారు. పట్టణంలోని జాతీయ రహదారిపై ఆందోళన చేపట్టారు. యూరియా కోసం రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందన్నారు. నాయకులు ఎల్లాల శ్రీకాంత్‌రెడ్డి, అయ్యోరి రాజేష్, సౌళ్ల భీమన్న, సంగి శేఖర్, మొగిలి శేఖర్, మహిపాల్‌రెడ్డి, స్తంభంకాడి మహేశ్, శ్యాం, ప్రేమచందర్‌రావు, మహేశ్, ఆరెపల్లి రమేశ్, అయ్యోరి వేణుగోపాల్, నర్సయ్య, కాశెట్టి విజయ్ పాల్గొన్నారు.

కేడీసీసీబీలో భారీగా బదిలీలు