
ఇసుక రీచ్‌ను రద్దు చేయండి
రీచ్‌లోకి వాహనాలు వెళ్లకుండా తవ్విన కందకం
ఆత్మకూర్‌లో ఇసుక రీచ్ రద్దు చేయాలని నినాదాలు చేస్తున్న గ్రామస్తులు
మెట్‌పల్లిరూరల్: మెట్‌పల్లి మండలం ఆత్మకూర్ పెద్దవాగులో ఇసుక రీచ్‌ను గుర్తిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ గ్రామస్తులు నిరసన వ్యక్తం చేశారు. రీచ్‌గా గుర్తిస్తున్నట్లు జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఇసుక రీచ్ పాయింట్‌కు వెళ్లే ప్రధాన రహదారిపై బైఠాయించి దాదాపు నాలుగు గంట లపాటు ఆందోళన చేశారు. వాగులో ఇసుక తవ్వి తే భూగర్భజలాలు పడిపోతాయని, నీటిలభ్యత తగ్గి పర్యావరణం దెబ్బతింటుందని పేర్కొన్నా రు. రీచ్ వద్దని ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు, రాజకీయ పార్టీల నాయకులను కలిశామ ని, వారి నుంచి స్పందనలేదని తెలిపారు. ఎన్న డూ లేనివిధంగా కొత్తగా ఈ ప్రాంతంలో రీచ్ ఏర్పాటు చేయడమేంటని ప్రశ్నించారు. విషయం తెలుసుకున్న ఆర్‌ఐ ఉమేశ్ అక్కడికి చేరుకుని ప్రభుత్వ నిర్ణయం, ఉన్నతాధికారుల ఆదేశాలకు అనుగుణంగా ఇసుక తవ్వకాలకు అనుమతులు ఇచ్చామని స్పష్టం చేశారు. అనుమతి ఉన్న వాహనాలను అడ్డుకోవద్దని, అధికారుల విధులకు ఆటంకం కలిగించొద్దన్నారు. ఇబ్బందులు సృష్టిస్తే చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు.
రీచ్‌లోకి వాహనాలు వెళ్లకుండా కందకం
రీచ్‌లోకి వాహనాలు వెళ్లకుండా గ్రామస్తులు పొక్లెయిన్‌తో కందకం తవ్వించారు. కథలాపూర్ మండలం కలిగోట సూరమ్మ ప్రాజెక్ట్ పనులకు ఇసుక తరలించేందుకు అధికారులు అనుమతి ఇచ్చిన విషయం తెల్సిందే. రీచ్ పాయింట్‌లోకి వాహనాలు వెళ్లేలా కాంట్రాక్టర్ ఇటీవల దారి పోయించాడు. ముందుగా ఆందోళన చేసిన గ్రామస్తులు అనంతరం వాహనాలు వెళ్లకుండా కందకం తవ్వించారు.

ఇసుక రీచ్‌ను రద్దు చేయండి