
శిక్షణ కేంద్రాలతో యువతకు ఉపాధి
రాయికల్: నిరుద్యోగ యువత శిక్షణ కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ అన్నారు. మంగళవారం పట్టణంలోని చిన్న జీయర్‌స్వామి ట్రస్ట్ భవనంలో జీఎంఆర్ వరలక్ష్మీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రతిమ ఫౌండేషన్ సౌజన్యంతో ఎలక్ట్రికల్ హౌస్ వైరింగ్, టైలరింగ్, హోం ఎయిడ్ హెల్త్ కోర్సులో శిక్షణ పూర్తి చేసుకున్న వారికి సర్టిఫికెట్లు అందించారు. నిరుద్యోగ యువత కోసం మాజీ గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్‌రావు జీఎంఆర్ ట్రస్ట్ ప్రారంభించారని, ఇప్పుడు ఇస్తున్న ఉచిత శిక్షణను నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలన్నారు. సింగిల్ విండో చైర్మన్ ఏనుగు మల్లారెడ్డి, మున్సిపల్ కమిషనర్ మనోహర్, చిన్న జీయర్‌స్వామి ట్రస్ట్ ఇన్‌చార్జి ముత్యం రాజిరెడ్డి, ప్రోగ్రాం ఆఫీసర్ శ్రీనివాస్, ప్రిన్సిపల్ మహేశ్, జీఎంఆర్ సిబ్బంది నాగేందర్, ప్రమోద్, చిరంజీవి, కృష్ణవేణి, వనిత, ప్రతిమ ఫౌండేషన్ మేనేజర్ గీతరెడ్డి, ఆర్గనైజర్ నాగిరెడ్డి రఘుపతి పాల్గొన్నారు.
అధికార పార్టీగా మద్దతుగా ఉంటేనే అభివృద్ధి
సారంగాపూర్: అధికార పార్టీకి మద్దతుగా ఉంటేనే అభివృద్ధి సాధ్యమని ఎమ్మెల్యే సంజయ్ అన్నారు. బీర్‌పూర్, సారంగాపూర్‌లో తన మద్దతుదారులతో సమావేశమయ్యారు. రోళ్లవాగు ప్రాజెక్టు పూర్తికి కృషి చేస్తున్నానని తెలిపారు. తుంగూర్‌లో కేజీబీవీ ఏర్పాటు చేశామన్నారు. 14 పల్లెదవాఖానాలు మంజూరు చేశామన్నారు. బీర్‌పూర్ మండలంలో ఇందిరానగర్, గొండుగూడెంలను పంచాయతీలు చేశామన్నారు. కేడీసీసీ బ్యాంక్ డైరెక్టర్ ముప్పాల రాంచందర్‌రావు, విండో చైర్మన్లు ఏలేటి నర్సింహారెడ్డి, గుర్నాథం మల్లారెడ్డి, మాజీ జెడ్పీటీసీ మేడిపల్లి మనోహర్‌రెడ్డి తదితరులు ఉన్నారు.