
విద్యుత్ షాక్ బాధితుడి క్షోభ
కోరుట్ల: కోరుట్లలో జూన్ 15న గణపతి విగ్రహాన్ని తరలిస్తుండగా విద్యుత్ షాక్‌కు గురైన బాధితుడు సుమారు నలభై రోజుల పాటు కరీంనగర్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొంది ఎట్టకేలకు ఇంటికి చేరుకున్నాడు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, కోరుట్ల సెగ్మెంట్ కాంగ్రెస్ ఇన్‌చార్జి జువ్వాడి నర్సింగరావు ఔదార్యంతో రెండురోజుల క్రితం ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యాడు.
బిల్లు కట్టలేని దయనీయం
గణపతి విగ్రహాల తయారీలో కూలీగా పనిచేస్తున్న వెంకటరెడ్డిరాజేశ్ విద్యుత్‌షాక్‌కు గురికాగా ఆయన శరీరంతో పాటు తల కొంత భాగం కాలి పోయింది. దీంతో మొదట హైదరాబాద్‌లో చికి త్స అందించినా పరిస్థితి కుదుటపడలేదు. మళ్లీ కరీంనగర్‌లోని ఓ ఆస్పత్రిలో చేర్చి ఖరీదైన వై ద్యం చేయాల్సి వచ్చింది. సుమారు 20 రోజుల పాటు కరీంనగర్ ఆస్పత్రిలో చికిత్స పొందిన రా జేశ్‌కు బిల్లు రూ.11 లక్షలు కావడంతో దిక్కుతోచని స్థితిలో పడ్డారు. చేతిలో చిల్లిగవ్వ లేని పరిస్థితుల్లో కోరుట్లలోని 9వ వార్డు కాంగ్రెస్ ఇన్‌చార్జి ఎడ్ల రమేశ్ రూ.లక్ష ఆర్థికసాయం చేశారు. మరో రెండున్నర లక్షలు ఇతరులు సమకూర్చినా ఆస్పత్రి బిల్లు కట్టలేని దుస్థితిలో అక్కడే ఉండిపోయాడు.
అడ్లూరి ఔదార్యం
డబ్బులు లేక ఆసుపత్రిలో చికిత్స లేకున్నా డిశ్చార్జి కాలేక అక్కడే ఉండడంతో బిల్లు మరో రూ.2 లక్షలు పెరిగింది. మొత్తం రూ. 9 లక్షలు కట్టాల్సిన పరిస్థితి. ఈ క్రమంలో బాధిత కుటుంబ దుస్థితిని కాంగ్రెస్ నాయకుడు రమేష్, కోరుట్ల సెగ్మెంట్ ఇన్‌చార్జి జువ్వాడి నర్సింగరావు దృష్టికి తెచ్చా రు. ఆయన మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌కు సమస్యను తెలిపారు. వెంటనే మంత్రి స్పందించి జిల్లా కలెక్టర్ నిధుల నుంచి రూ.3 లక్షలు ఇప్పించడంతో పాటు తనవంతు సాయంగా రూ. 5 లక్షల మేర అందిస్తానని ఆస్పత్రి వారికి చెప్పి ఔ దార్యం చూపారు. ఫలితంగా బాధితుడు ఇంటికి చేరాడు. కాగా రాజేశ్‌కు మరో చిన్నపాటి ఆపరేషన్ చేయాల్సి ఉండడంతో తమను ఆదుకోవాల ని తల్లి లక్ష్మి కన్నీళ్లు పెట్టుకుని వేడుకుంటుంది.