ఆరోగ్య కేంద్రాల్లో మెరుగైన వైద్యం
మెట్‌పల్లిరూరల్: ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయని డీఎంహెచ్‌వో ప్రమోద్‌కుమార్ అన్నారు. మెట్‌పల్లి మండలం జగ్గాసాగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని గురువారం తనిఖీ చేశారు. కేంద్రానికి వచ్చిన పలువురితో వైద్య సేవలపై ఆరా తీశారు. రికార్డులు, మందుల స్టాక్ పరిశీలించారు. క్షయ సంబంధిత కేసులు, జాతీయ ఆరోగ్య కార్యక్రమాల ప్రగతి, ఇతరత్రా విషయాలు తెలుసుకున్నారు. ఫీవ ర్ సర్వే, దోమలతో కలిగే వ్యాధులను ప్రజలకు వివరించాలన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే కాన్పులు చేయించేలా కృషి చేయాలని సూచించారు. వైద్య సేవలపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఎంఎల్‌హెచ్‌పీ డాక్టర్లు, సూపర్‌వైజర్లు, ఏఎన్‌ఎంలతో సమీక్షించారు. మండల వైద్యాధికారి ఎల్లాల అంజిత్‌రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.


