ధాన్యం కొనుగోళ్లలో జాప్యం చేయొద్దు
మెట్‌పల్లిరూరల్: ధాన్యం కొనుగోళ్లలో జాప్యం చే యొద్దని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. మెట్‌పల్లి మండలం ఆత్మనగర్, ఆత్మకూర్ గ్రామాల్లోని కొ నుగోలు కేంద్రాలను బుధవారం పరిశీలించారు. తప్ప, తాలు లేకుండా తేమ శాతం వచ్చిన ధా న్యాన్ని వెంటవెంటనే కొనుగోలు చేసి రైస్‌మిల్లులకు తరలించాలని సూచించారు. కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. కార్యక్రమంలో ఆర్డీవో శ్రీనివాస్, డీఆర్డీవో పీడీ రఘువరణ్, డీసీవో మనోజ్, తహసీల్దార్ శ్రీనివాస్, ఏవో దీపిక, ఏపీఎం విమోచన, ఆర్‌ఐ ఉమేశ్, సివిల్ సప్‌లై అధికారులు పాల్గొన్నారు.
● కలెక్టర్ సత్యప్రసాద్


