దళారులకు అమ్మి నష్టపోవద్దు
మెట్‌పల్లిరూరల్: రైతులు తమ పంటలను దళారులకు అమ్మి నష్టపోవద్దని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ అన్నారు. మెట్‌పల్లి మండలం రామలచ్చక్కపేట, ఆత్మనగర్, ఆత్మకూర్, మెట్లచిట్టాపూర్‌లో ఐకేపీ కొనుగోలు కేంద్రాలను గురువారం ప్రారంభించారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కూన గోవర్ధన్, తహసీల్దార్ శ్రీనివాస్, ఏవో దీపిక, ఏపీఎం విమోచన, మెట్లచిట్టాపూర్ పీఏసీఎస్ చైర్మన్ నవీన్‌రెడ్డి, నాయకులు పాల్గొన్నారు.


