వైభవంగా శ్రీవేంకటేశ్వరస్వామి ఉత్సవం | - | Sakshi
Sakshi News home page

వైభవంగా శ్రీవేంకటేశ్వరస్వామి ఉత్సవం

Mar 31 2025 8:27 AM | Updated on Mar 31 2025 8:27 AM

ఇబ్రహీంపట్నం: మండలంలోని వర్షకొండలో శ్రీవేంకటేశ్వరస్వామి జాతర ఉత్సవాలను గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం వైభవంగా నిర్వహించారు. బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు విద్యాసాగర్‌రావు స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. గ్రామానికి చెందిన మామిడి చిన్నయ్య పటేల్‌ వారసులు రూ. 3.50 లక్షలు వెచ్చించి స్వామివారి రథోత్సవాన్ని తయారు చేయించారు. రైతులు ఎడ్లబండ్లు, ట్రాక్టర్లతో దేవాలయం చుట్టూ తిరిగారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్‌ దొంతుల శ్యామల, తుక్కారాం, మాజీ ఎంపీటీసీ పొనకంటి వెంకటి పాల్గొన్నారు.

బీర్‌పూర్‌లో ఎడ్లబండ్ల పోటీలు

సారంగాపూర్‌: బీర్‌పూర్‌లో నిర్వహించిన ఎడ్లబండ్ల పోటీలను జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌ ప్రారంభించారు. ఉగాది వేడుకల్లో భాగంగా శ్రీలక్ష్మీనృసింహస్వామి జాతర స్థలంలో ఎడ్లబండ్ల పోటీలు నిర్వహించారు. చిన్నతనంలో ఉగాది, వినాయకచవితి, శ్రీరామనవమి, సంక్రాంతి వంటి పండగలకు గ్రామాల్లో ఎడ్లబండ్ల పోటీలు నిర్వహించేదని, యాంత్రీకరణ పెరిగాక పోటీలు తక్కువగా జరుగుతున్నాయని పేర్కొన్నారు. పోటీలను 15ఏళ్లుగా నిర్వహిస్తున్న గోనే రమణారావు (వెంకటేశ్వర్‌రావు)ను అభినందించారు. ధర్మపురి, బీర్‌పూర్‌ మండలాల నుంచి 22 మంది రైతులు పోటీల్లో పాల్గొన్నారు. విజేతలకు ఎమ్మెల్యే బహుమతులు అందించారు. కార్యక్రమంలో ఎస్సై కుమారస్వామి, కేడీసీసీ డైరెక్టర్‌ ముప్పాల రాంచందర్‌రావు, ఆలయ మాజీ చైర్మన్‌ నేరెల్ల సుమన్‌గౌడ్‌, హరీశ్‌, సుధాకర్‌, కృష్ణారావు, రాజేందర్‌రెడ్డి, శ్రీనివాస్‌, రాజేశం, మహేందర్‌ పాల్గొన్నారు.

మైతాపూర్‌లో మల్లన్న బోనాలు

రాయికల్‌: మండలంలోని మైతాపూర్‌లో ఆదివారం మల్లన్న స్వామికి యాదవ సంఘం మహిళలు బోనాలు చేశారు. నెత్తిన బోనాలతో మహిళలు పురవీధుల గుండా వెళ్లి మల్లన్న స్వామికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు గోపి రాజరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

బల్దియా కార్మికులకు స్వీట్లు పంపిణీ

జగిత్యాలటౌన్‌: విశ్వావసు నామ ఉగాదిని పురస్కరించుకుని బీఆర్‌ఎస్‌ నాయకులు ఆదివారం బల్దియా కార్మికులకు మిఠాయిలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. ఎమ్మెల్సీ ఎల్‌.రమణ ఆదేశాల మేరకు బల్దియా కార్మికులకు మిఠాయిలు పంపిణీ చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ నాయకులు గట్టు సతీశ్‌, ఒల్లెం మల్లేశం, దయాల మల్లారెడ్డి, గంగాధర్‌, వెంకటేశ్వర్‌రావు తదితరులు పాల్గొన్నారు.

ఇంటింటా కాషాయ జెండాలు పంపిణీ

ధర్మపురి: నూతన సంవత్సర విశ్వావసు ఉగాది పర్వదినం సందర్భంగా బీజేపీ పట్టణ అధ్యక్షుడు గాజు భాస్కర్‌ ఆధ్వర్యంలో పట్టణంలోని వివిద వార్డుల్లో ఇంటింటికీ కాషాయ జెండాలు పంపిణీ చేశారు. ప్రజలు హిందుత్వాన్ని చాటి చె ప్పాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు లవన్‌కుమార్‌, గుండ రాజేశ్వర్‌, దివిటి శ్రీధర్‌, రాజేష్‌ పాల్గొన్నారు.

వైభవంగా శ్రీవేంకటేశ్వరస్వామి ఉత్సవం1
1/2

వైభవంగా శ్రీవేంకటేశ్వరస్వామి ఉత్సవం

వైభవంగా శ్రీవేంకటేశ్వరస్వామి ఉత్సవం2
2/2

వైభవంగా శ్రీవేంకటేశ్వరస్వామి ఉత్సవం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement