Telangana News: నేను బతికే ఉన్నాను.. అయినా నన్ను చంపేశారు!
Sakshi News home page

నేను బతికే ఉన్నాను.. అయినా నన్ను చంపేశారు!

Aug 25 2023 1:08 AM | Updated on Aug 25 2023 1:07 PM

- - Sakshi

జగిత్యాల: రాయికల్‌ మండలం కుర్మపల్లి గ్రామానికి చెందిన పుల్ల వెంకటేశ్‌కు గ్రామంలో రెండెకరాల వ్యవసాయ భూమి ఉంది. పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధి డబ్బులు 2021 వరకు మంజూరయ్యాయి. తర్వాత ఖాతాలో డబ్బులు జమకాకపోవడంతో సందేహం వచ్చిన వెంకటేశ్‌ మీసేవలో సంప్రదించగా చనిపోయినట్లుగా ఉండటంతో పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధి నిలిచిపోయినట్లు చూపించింది.

దీంతో అవాక్కయిన వెంకటేశ్‌ సంబంధిత వ్యవసాయాధికారుల దృష్టికి తీసుకెళ్లాడు. ఎక్కడో తప్పిదం జరిగిందని, పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధి నిధులు మంజూరయ్యేలా చూస్తామని అధికారులు తెలిపారు. ఏదేమైనా తాను బతికుండగా చనిపోయినట్లుగా ఆన్‌లైన్‌లో నమోదైందని వెంకటేశ్‌ వాపోయాడు.

Advertisement
 
Advertisement
Advertisement