మెట్‌పల్లి: స్థానిక సంస్థల్లో పాలనకు సంబంఽధించిన వివిధ అంశాలపై అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక శిక్షణ కార్యక్రమానికి మెట్‌పల్లి బల్దియా కౌన్సిలర్లు పలువురు డుమ్మా కొట్టారు. హైదరాబాద్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి సగానికి పైగా కౌన్సిలర్లు గైర్హాజరుకావడం చర్చనీయాంశమైంది. కొత్తగా ఎన్నికై న కౌన్సిలర్లు, కో–ఆప్షన్ సభ్యులకు మున్సిపల్ చట్టాలు, పాలన, నిధుల వినియోగం, అభివృద్ధి పనులు, ప్రభుత్వ పథకాల అమలు, ప్రజాప్రతినిధుల బాధ్యతలపై అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం శిక్షణను ఏర్పాటు చేసింది. ఇందుకు హైదరాబాద్‌కు వెళ్లడానికి ప్రయాణం, ఇతర ఖర్చుల కింద ఒక్కొక్కరికి రూ.2వేల చొప్పున అధికారులు అందించినట్లు సమాచారం. ఎంతో ప్రాధాన్యమున్న ఈ శిక్షణకు కొందరు కౌన్సిలర్లు దూరంగా ఉండడం విమర్శలకు తావిస్తోంది. 26 మంది కౌన్సిలర్లు, ముగ్గురు కో–ఆప్షన్ సభ్యులు కలుపుకొని 29మంది ఉంటే.. కేవలం 11మందే శిక్షణకు వెళ్లినట్లు తెలిసింది. ఖర్చుల కింద మాత్రం డబ్బులు అందరికీ ముందుగానే ఇచ్చినట్లు సమాచారం.
ఘనంగా సినారె జయంతి
జగిత్యాల: జ్ఞానపీఠ అవార్డు గ్రహీత సి.నారాయణరెడ్డి 99వ జయంతి వేడుకలను కళాశ్రీ ఈశ్వరమ్మ సాహితీపీఠం ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కళాశ్రీ అధినేత రాజు మాట్లాడుతూ సినారె సాహితీరంగంలో చెరగని ముద్ర వేసుకున్నారని గుర్తు చేశారు. కార్యక్రమంలో సాహితీవేత్తలు జమున, అనిత, లక్ష్మీ, లావణ్య, కవిత, శ్రీనివాస్, గంగాధర్ పాల్గొన్నారు.


