వరద ప్రాంతాన్ని పరిశీలిస్తున్న ఎస్పీ
కూలిన ఇంటి వద్ద బాధితులు
జగిత్యాలక్రైం: భారీ వర్షాలపై పోలీసులు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ అశోక్‌కుమార్ అన్నారు. వరద ప్రాంతాలను అధికారులతో కలిసి బుధవారం పరిశీలించారు. ప్రజలు వాగులు, వంకల వద్దకు వెళ్లొద్దని సూచించారు. లోతట్టు ప్రాంతాలు, కల్వర్టులు, నీరు నిలిచే ప్రాంతాల్లో జాగ్రత్తలు తీసుకోవాలని టెలికాన్ఫరెన్స్ ద్వారా పోలీసు అధికారులు, సిబ్బందికి సూచించారు. వరద ప్రాంతాల్లో తాత్కాలిక హెచ్చరిక బోర్డులు, బారీకేడ్లు ఏర్పాటు చేయాలన్నారు. నాలుగు రోజులపాటు భారీ నుంచి అతిభారీ వర్షం కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. అత్యవసర పరిస్థితుల్లో డయల్ 100కు సమాచారం అందించాలన్నారు.
పెంబట్లలో కూలిన ఇల్లు
సారంగాపూర్ మండలం పెంబట్ల, కోనాపూర్‌కు చెందిన పస్తం స్వప్న ఇల్లు భారీ వర్షానికి కూలిపోయింది. బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు.
పోలీసుల సూచనలు...
● ఉధృతంగా ప్రవహిస్తున్న నీటిలోకి ఎట్టి పరిస్థితుల్లోనూ దిగవద్దు
● చేపల వేటకు చెరువులు, వాగులు, నదుల వద్దకు వెళ్లవద్దు
● నీట మునిగిన కల్వర్టులు, వంతెనలు, వాగులను దాటే ప్రయత్నం చేయవద్దు
● విద్యుత్ స్తంభాలు, తెగిపోయిన తీగలను ముట్టుకోవద్దు
● రైతులు విద్యుత్ తీగలు, నీటి ప్రవాహంపై అప్రమత్తంగా ఉండాలి
● శిథిలావస్థలో ఉన్న, కూలిపోయే ఇళ్లలో ఉండొద్దు
● మైనర్లకు వాహనాలు ఇవ్వవద్దు
● సెల్ఫీ, రీల్స్ కోసం జలపాతాల వద్దకు వెళ్లవద్దు


