నగరాలకు చెట్లు ఎందుకు అవసరం?.. 12 పాయింట్లలో పూర్తి వివరాలు! | Why cities need more trees; Full details in 12 points - Sakshi
Sakshi News home page

నగరాలకు చెట్లు అందించే 12 ప్రయోజనాలివే!

Sep 2 2023 11:44 AM | Updated on Sep 2 2023 11:59 AM

Why cities need trees Full details in 12 points - Sakshi

చెట్లు అందించే ప్రయోజనాల గురించి అందరికీ తెలిసిందే. అయితే పట్టణాల్లోని చెట్లు ఆ ప్రాంతానికి మరింత ప్రయోజనాన్ని కల్పిస్తాయి. అవేమిటో 12 పాయింట్లలో ఇప్పుడు తెలుసుకుందాం. 

1. ఉష్ణోగ్రత నియంత్రణ
ఒక పెద్ద వృక్షం 10 ఎయిర్ కండిషనింగ్ యూనిట్లకు సమానం. అది అందిచే నీడ  ఆ ప్రాంత ఉష్ణోగ్రతను 30 శాతానికి మించి తగ్గిస్తుంది.

2. శబ్ద కాలుష్యానికి చెక్‌
చెట్లు 50 శాతం మేరకు శబ్ద కాలుష్యాన్ని తగ్గిస్తాయి. వాహనాలు, నిర్మాణ పనులు, సైరన్‌లు ఇతరత్రా శబ్దాలతో నిండిన పట్టణ ప్రాంతాల్లో చెట్లు ఆ శబ్దాన్ని నిరోధించడానికి ఉపకరిస్తాయి. ఇళ్లు, కార్యాలయాలను నిశ్శబ్దంగా ఉంచడానికి వృక్షాలు దోహదపడగాయి.

3. స్వచ్ఛమైన గాలి
చెట్ల నుంచి విడుదలయ్యే గాలి.. హానికరమైన కాలుష్య కారకాలను, టాక్సిన్‌లను భారీ మొత్తంలో తొలగిస్తాయి. పట్టణ ప్రాంతాల్లో గాలి నాణ్యత చాలా తక్కువగా ఉంటుంది. అటువంటి  పరిస్థితిలో చెట్లు మనకు పరిశుభ్రమైన గాలిని అందిస్తాయి. 

4. ఆక్సిజన్ అందిస్తూ..
కాలుష్యాలను తరిమికొట్టే చెట్లు మరింత ఆక్సిజన్‌ను కూడా అందిస్తాయి. గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే నగరాల్లో ఆక్సిజన్ స్థాయిలు గణనీయంగా తక్కువగా ఉంటాయి. చెట్లు ఈ సమస్యను పరిష్కరించడానికి దోహదపడతాయి.

5. నీటి నిర్వహణ
చెట్లు మనకు భవనాలకు మించిన ఆశ్రయం కల్పిస్తాయి. వర్షాలు కురిసే సమయంలో చెట్లు భారీ మొత్తంలో నీటిని గ్రహిస్తాయి. వరదల తీవ్రతను నియంత్రిస్తాయి. వరదలు వచ్చే అవకాశాన్ని తగ్గిస్తాయి. చెట్లు కాలుష్య కారకాలను గ్రహిస్తాయని, నీటి వనరులను కాపాడుతాయనే విషయాన్ని మనం మరచిపోకూడదు. 

6. మానసిక ఆరోగ్యం
పరిశుభ్రమైన పట్టణ పరిసరాల కంటే ప్రకృతి మధ్యలో మెలిగే మనుషులు సంతోషంగా ఉంటారని పలు అధ్యయనాల్లో తేలింది. మన భావోద్వేగాలు, ప్రవర్తన, ఆలోచనలు మనం ఉంటున్న ప్రదేశాలపై ఆధారపడివుంటాయి.  చెట్లు మన మనస్తత్వంపై సానుకూల ప్రభావాన్ని చూపిస్తాయి. మనిషి శాంతియుతంగా ఉండటం వల్ల కలిగే ప్రయోజనాలు అపారం.

7. శారీరక ఆరోగ్యం
చెట్లు గాలి నాణ్యతను మెరుగు పరుస్తాయి. పట్టణంలోని చెట్లతో కూడిన వాతావరణం మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. చెట్లు విరివిగా ఉన్న పట్టణ ప్రాంతాల్లో సైక్లింగ్, రన్నింగ్, నడక మొదలైనవి ఆహ్లాదాన్ని, ఆరోగ్యాన్ని అందిస్తాయి. 

8. గోప్యత
చెట్లు గోప్యతను అందిస్తాయి. ఇంటివాతావరణాన్ని కల్పిస్తాయి.

9. ఆర్థికపరంగా..
పట్టణంలోని చెట్లు అందించే ఆర్థిక ప్రయోజనాలను లెక్కించడం కష్టం. దెబ్బతిన్న మౌలిక సదుపాయాల మరమ్మతులకు చెట్లు ఉపకరిస్తాయి. చెట్లను పెంచే ఖర్చు కంటే అవి అందించే ప్రయోజనాలు అధికంగా ఉంటాయి. చెట్లు నగరాలను సంపన్నం చేస్తాయి.

10. వన్యప్రాణులకు ఆవాసం
పక్షులు,క్షీరదాలు, కీటకాలతో సహా వందలాది విభిన్న జాతులకు ఆవాసంగా చెట్లు ఉపకరిస్తాయి. 

11. కాంతి కాలుష్యం
చెట్లు కాంతి కాలుష్యాన్ని అడ్డుకోవడమే కాకుండా, మనల్ని, మన నగరాలను చల్లగా ఉంచుతాయి. చెట్లు ఉన్న నగరాల్లో ఆకాశం స్పష్టంగా కనిపిస్తుంది.

12. ఆహ్లాదాన్ని అందిస్తూ..
చెట్లు అందంగా ఉంటాయి. గ్రేస్కేల్ రోడ్లు, భవనాలు, అంతులేని ట్రాఫిక్‌ మధ్య చెట్లు ఉపశమనాన్ని కల్పిస్తాయనడంలో సందేహం లేదు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement