డేటింగ్‌ యాప్‌లో పరిచయం.. 70 ప్లస్‌లో ప్రేమ.. ఆపై పెళ్లి | Viral: Elderly Couple Married After Meeting Online Pandemic | Sakshi
Sakshi News home page

Old Couple Love story: డేటింగ్‌ యాప్‌లో పరిచయం.. 70 ప్లస్‌లో ప్రేమ.. ఆపై పెళ్లి

Oct 9 2021 9:21 PM | Updated on Oct 9 2021 9:35 PM

Viral: Elderly Couple Married After Meeting Online Pandemic - Sakshi

ప్రేమకు వయసుతో సంబంధం లేదు.. ఏజ్‌ ఈజ్‌ జస్ట్‌ ఏ నంబర్‌, ప్రేమకు సరిహద్దులు లేవు... ఈ డైలాగులు అప్పుడప్పుడు సినిమాల్లో మనం వింటూనే ఉంటాం. అయితే ఇద్దరు వృద్ధులు మాత్రం ఏడు పదులు వయసులో కూడా  ఆ మాటలను నిజం చేసి చూపించారు. అసలు ఈ 70 ప్లస్‌ లవ్‌స్టారీ ఎలా మొదలైందంటే..  పెయింటర్, రిటైర్డ్ ప్రొఫెసర్ అయిన జిమ్ ఆడమ్స్‌కు పెళ్లయిన 38 సంవత్సరాల తర్వాత 2017లో తన భార్యను కోల్పోయాడు.

ఇటీవల కరోనా కారణంగా విధించిన లాక్‌డౌన్‌ సమయంలో, 78 ఏళ్ల అతను తనకి ఓ తోడు కావాలని నిర్ణయించుకుని 50 ఏళ్లు పైబడిన మహిళ కోసం ఆన్‌లైన్ డేటింగ్ యాప్‌లో లాగిన్‌ అయ్యాడు. అలా తోడు కోసం వెతుకుతున్న ఆడమ్స్‌కు అనుకోకుండా 79 ఏళ్ల రిటైర్డ్ ఇన్సూరెన్స్ బ్రోకర్ ఆడ్రీని కలిశాడు. ఆమె 33 సంవత్సరాల క్రితం విడాకులు తీసుకుని ఒంటరిగా ఉంటోంది. చివరికి ఒకిరికొకరు నచ్చడంతో ఇటీవలే పెళ్లి కూడా చేసుకుంది ఆ జంట. దీనిపై ఆడ్రీ.. నేను ఆ యాప్‌ ఉపయోగించిన తక్కువ సమయంలోనే ఆడ్రీని చూశాను. నాతో పరిచయం పెంచుకున్న తర్వాత మేము దగ్గర కావడానికి ఎక్కువ రోజులు కూడా పట్టలేదు.

ఎందుకంటే తను కూడా నా లాంటి క్రేజీ పర్సన్‌ కాబట్టి.. అంటూ తెలిపాడు. ఈ ఏడాది సెప్టెంబ‌ర్ 25వ తేదీ వీరి ప్రేమ బంధం పెళ్లి బంధంగా మార్చుకుంది ఆ వృద్ధ జంట. ప్రస్తుతం నెట్టింట జిమ్, ఆడ్రి పెళ్లి చేసుకున్న ఫోటోలు వైర‌ల్‌గా మారి చక్కర్లు కొడుతున్నాయి. ఆ జంట‌ను చూసిన నెటిజ‌న్లు  వారికి ఆల్‌ ది బెస్ట్‌ అని కామెంట్‌ పెడుతున్నారు. పోస్ట్ అప్‌లోడ్ చేసినప్పటి నుండి 1.5 లక్షలకు పైగా లైకులు వచ్చాయి.

చదవండి: Viral: ప్రియుడి బాధ చూడలేక ప్రేయసి త్యాగం.. సినిమాల్లో కూడా సాధ్యం కాదేమో !

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement