వైరల్‌: ప్రియుడి బాధ చూడలేక ప్రేయసి త్యాగం.. సినిమాల్లో కూడా సాధ్యం కాదేమో ! | Viral: Woman Marries Boyfriend Father After His Mother Passed Away | Sakshi
Sakshi News home page

Viral: ప్రియుడి బాధ చూడలేక ప్రేయసి త్యాగం.. సినిమాల్లో కూడా సాధ్యం కాదేమో !

Oct 9 2021 8:10 PM | Updated on Oct 9 2021 8:41 PM

Viral: Woman Marries Boyfriend Father After His Mother Passed Away - Sakshi

ప్రేమికులు తాము ప్రేమించిన వారి కోసం త్యాగాలు చేయడం రియల్‌ లైఫ్‌ కంటే రీల్‌ లైఫ్‌లోనే ఎక్కువగా చూసుంటాం. అయితే ఓ యువతి ఏకంగా తన ప్రియుడి కోసం తమ ప్రేమనే త్యాగం చేయాలనుకుంది. అయితే ఆ యువతి చేసిన పనిని కొందరు మెచ్చుకుంటుంటే మరికొందరు ఇదేం పనంటూ మండిపడుతున్నారు. అంతలా తను ఏం చేసిందంటే.. తన బాయ్‌ఫ్రెండ్‌ కోసం అతని తండ్రినే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంది. సింపుల్‌గా చెప్పాలంటే భార్య కావాల్సిన అమ్మాయి తనకి అమ్మలా మారుతానంటోంది. అయితే దీని వెనుక ఓ కారణం కూడా ఉంది

ఓ యువతి బాయ్‌ఫ్రెండ్ త‌ల్లి మ‌ర‌ణించ‌డంతో అతనికి త‌ల్లి లేని లోటు తీర్చేందుకు ఏకంగా అత‌డి తండ్రిని పెండ్లి చేసుకోవాల‌ని మ‌హిళ నిర్ణ‌యించుకుంది. బాయ్‌ఫ్రెండ్ తండ్రిని ఎందుకు అనూహ్యంగా వివాహం చేసుకోవాల్సి వ‌చ్చింద‌ని టిక్‌టాక్ యూజ‌ర్ వైఎస్‌.అమ్రి ఇచ్చిన వివ‌ర‌ణపై నెటిజ‌న్లు త‌లో ర‌కంగా స్పందిస్తున్నారు. కాగా తను ఇలాంటి నిర్ణయం తీసుకున్నందుకు వివరణగా.. త‌న‌ బాయ్‌ఫ్రెండ్ త‌ల్లి మ‌ర‌ణించింది. దీంతో అత‌ను తీవ్ర విషాదంలో మునిగిపోయాడు. మనకిష్టమైన వాళ్లు అలా బాధపడుతుంటే చూస్తే ఎవరూ ఉండరు కదా అలానే త‌నకు అది ఇష్టం లేదని తెలిపింది.

అందుకే తన బాయ్‌ఫ్రెండ్‌కు తన త‌ల్లిని తిరిగి ఇవ్వాలని నిర్ణయించుకున్నానని, అందుకోసం తాన ప్రియుడి తండ్రిని తానే వివాహం చేసుకోవాల‌ని నిర్ణ‌యించుకున్నట్లు ఆమె చెప్పుకొచ్చింది. అయితే కొందరు నెటిజన్లు మాత్రం ఆమె త్యాగాన్ని ప్రశంసిస్తూ ఉంటే మ‌రికొంద‌రు మాత్రం ఆమె ఇటువంటి నిర్ణయం ఎందుకు తీసుకుందని ఆశ్చర్యపోతున్నారు. 

చదవండి: #inspiring: హ్యాట్సాఫ్‌ ఆర్య: ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తున్న తండ్రికూతుళ్లు


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement