భారత సంతతి ఓటర్లపై భారీ స్కెచ్‌? | USA midterm election voter list Trump Indian American voters controversy | Sakshi
Sakshi News home page

భారత సంతతి ఓటర్లపై భారీ స్కెచ్‌?

Oct 9 2026 9:40 AM | Updated on Oct 9 2026 10:41 AM

USA midterm election voter list Trump Indian American voters controversy

అమెరికాలో ఉన్న విదేశీయులపై ట్రంప్‌ అక్కసు ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఏదో కారణంతో తరచుగా వారిని వేదిస్తూ తరచుగా ఇబ్బందులకు గురిచేస్తుంటారు. అదే భారతీయులపై ఆ అక్కసు మరింత అధికంగా ఉంటుంది. అయితే త్వరలో అమెరికాలో మధ్యంతర ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ట్రంప్‌ అప్రమత్తమైనట్లు తెలుస్తోంది. మధ్యంతర ఎన్నికల్లో తనకు ఓటు వేయరనే భయంతో ఏకంగా ఓ‍ట్ల తొలగింపు చేపడుతున్నట్లు సమాచారం.

అమెరికాలో దాదాపుగా  21 లక్షల మంది భారతీయ-అమెరికన్ ఓటర్లు ఉన్నారు. అయితే ట్రంప్‌ భారతీయులపై చేసే తల బిరుసు వ్యాఖ్యలు, తదితర కారణాల రీత్యా వారు తొలుత నుంచి ప్రత్యర్థి అయిన డెమోక్రటిక్ పార్టీకే మద్దతు ఇస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మధ్యంతర ఎన్నికలలో భారతీయ- అమెరికన్‌ ఓట్లను పెద్దఎత్తున తొలగింపు చేస్తున్నట్లు సమాచారం. ట్రంప్ రిపబ్లికన్ పార్టీ అధికారంలో ఉన్న 26 రాష్ట్రాల నుంచి దాదాపు లక్ష మందికి పైగా  భారత సంతతి ఓటర్ల పేర్లను తొలగించినట్లు తెలుస్తోంది.

ఓటర్ల జాబితా ఎందుకు తనిఖీ ?

అమెరికాలో, ఓటు వేయడానికి అనర్హులైన వారి పేర్లను తొలగించడానికి ట్రంప్ ప్రభుత్వం ఓటర్ల జాబితాలను తనిఖీ చేస్తోంది. ఇది ఎన్నికల మోసాన్ని నివారించడంతో పాటు, ఓటింగ్ ప్రక్రియను మరింత సురక్షితం చేస్తుందని కారణాలు చెబుతోంది. ట్రంప్ "సేవ్ అమెరికా యాక్ట్" ప్రకారం యూఎస్ కాంగ్రెస్ దిగువ సభ ఆమోదించిన ఈ బిల్లు ప్రకారం, ఓటర్లుగా నమోదు చేసుకునేవారు తమ యూఎస్ పౌరసత్వాన్ని నిరూపించుకోవడానికి జనన ధృవీకరణ పత్రం లేదా పాస్‌పోర్ట్ వంటి పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది.

ఓటు వేయడానికి గుర్తింపు పత్రాలు సమర్పించే నిబంధనలను కూడా కఠినతరం చేయనున్నారు. ఈ నిబంధనలు పోలింగ్ కేంద్రంలో ఓటు వేయడానికి, అలాగే పోస్టల్ ఓటింగ్‌కు కూడా వర్తిస్తాయి. మరోవైపు, ఈ బిల్లును వ్యతిరేకించేవారు, జనన ధృవీకరణ పత్రాలు లేదా పాస్‌పోర్ట్‌లు లేకపోయినా, కఠినమైన పత్రాల నిబంధనలు అర్హులైన పౌరులను ఓటు వేయకుండా నిరోధించగలవని అంటున్నారు. ఈ చర్యలతో ట్రంప్ ప్రభుత్వం మధ్యంతర ఎన్నికలను ప్రభావితం చేయడానికి ప్రయత్నిస్తోందని డెమోక్రటిక్ పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు.

70 శాతం మంది అమెరికన్లు  అసంతృప్తి

కాగా ట్రంప్ సొంత రిపబ్లికన్ పార్టీలోనే ఆయనకు వ్యతిరేకంగా తిరుగుబాటు సంకేతాలు కనిపిస్తున్నాయి. ఆయన ప్రజాదరణ తగ్గుతోంది. మధ్యంతర ఎన్నికలలో ఆయన మద్దతు తమకు నష్టం కలిగిస్తుందని పార్టీ నాయకులు భయపడుతున్నారు.

నవంబర్ ఎన్నికలకు ముందు, చాలా మంది రిపబ్లికన్ అభ్యర్థులు ట్రంప్ నుండి తమను తాము దూరం చేసుకుంటున్నారు. కొందరు తమ ప్రచార వెబ్‌సైట్‌ల నుండి ట్రంప్ ,అతని "అమెరికా ఫస్ట్" ఎజెండా గురించిన ప్రస్తావనను పూర్తిగా తొలగించారు. కొంతమంది నాయకులు అతనితో కలిసి వేదిక పంచుకోవడానికి కూడా దూరంగా ఉంటున్నారు.

ఏపీ-ఎన్‌ఓఆర్‌సి సర్వే ప్రకారం, కేవలం 30% మంది అమెరికన్లు మాత్రమే ట్రంప్ పనితీరుతో సంతోషంగా ఉన్నారు. ఆర్థిక వ్యవస్థపై ఆయన ఆమోద రేటింగ్ 26%గా ఉంది. ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కోవడంలో ఆయన ఆమోద రేటింగ్ కేవలం 17% మాత్రమే. 65% కంటే ఎక్కువ మంది అమెరికన్లు పెరుగుతున్న ధరలకు ట్రంప్ విధానాలనే నిందిస్తున్నారు.

2024 అధ్యక్ష ఎన్నికలలో

2024లో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో  భారతీయ సంతతికి చెందిన ప్రజలలో సుమారు 65% మంది డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్‌కు ఓటు వేశారని సర్వేలు చెబుతున్నాయి. దీంతో ఈ సారి కూడా అలా జరిగితే తనపై ఉన్న వ్యతిరేకత బట్టబయలవుతుందని ట్రంప్ ఓట్లు తొలగింపు చేపడుతున్నట్లు తెలుస్తోంది.

మధ్యంతర ఎన్నికలు ఎందుకు?

సెనేట్ సభ్యుల పదవీకాలం 6 సంవత్సరాలు. అయితే అందరి పదవీకాలం ఒకేసారి ముగియకుండా, ప్రతి రెండేళ్లకు మూడో వంతు (1/3rd) స్థానాలకు మాత్రమే ఎన్నికలు జరిగేలా రాజ్యాంగంలో ఏర్పాటు చేశారు.   అంటే, అమెరికా అధ్యక్షుడికి 4 ఏళ్ల కాలపరిమితి ఉన్నప్పటికీ, దేశ చట్టాలను రూపొందించే పార్లమెంట్ (కాంగ్రెస్) సభ్యుల పదవీకాలాలు మాత్రం రెండేళ్లకే ముగిసిపోతుంటాయి. అందువల్ల అధ్యక్ష ఎన్నికలకు మధ్యలో ఈ ఎన్నికలు జరగడం వల్ల వీటిని "మధ్యంతర ఎన్నికలు" అని పిలుస్తారు.

మెజారిటీ నిలుపుకుంటారా? 

ఈ ఎన్నికలు రాబోయే రెండేళ్లలో యూఎస్ కాంగ్రెస్‌లో ఏ పార్టీ అధికారంలో ఉంటుందో నిర్ణయిస్తాయి. సెనేట్‌లో 100 మంది సభ్యులు ఉంటారు. ఈసారి, 35 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ప్రతినిధుల సభలో 435 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుతం, రిపబ్లికన్ పార్టీ సెనేట్‌లో 53 స్థానాలను, ప్రతినిధుల సభలో 218 స్థానాలను కలిగి ఉంది.ఈ ఎన్నికల్లో ట్రంప్ రిపబ్లికన్ పార్టీ ఓడిపోతే, కాంగ్రెస్‌లో చట్టాలను ఆమోదింపజేయడం ఆయనకు చాలా కష్టమవుతుంది. ఆయన తనకు నచ్చిన ఏ బిల్లునూ నేరుగా చట్టంగా మార్చలేరు.

ఇదీ చదవండి: అస్సాంలో రోడ్డు ప్రమాదం
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement