నూతన రంగాల్లోనూ కలిసి పనిచేస్తున్న భారత్, అమెరికా

US Vice President Kamala Harris hosts luncheon for Prime Minister Narendra Modi - Sakshi

కమలా హ్యారిస్‌ ఇచి్చన విందులో మోదీ  

వాషింగ్టన్‌: నూతన రంగాల్లోనూ భారత్, అమెరికా కలిసి పని చేస్తున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. అమెరికాలో పర్యటనలో ఉన్న మోదీ శుక్రవారం శ్వేతసౌధంలో ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్‌ ఇచి్చన విందులో పాల్గొన్నారు. నాలుగు రోజుల పర్యటన కోసం వచి్చన తనకు ఘన స్వాగతం పలికిన అమెరికా నాయకత్వానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

రక్షణ, వ్యూహాత్మక రంగాల్లో పరస్పర సహకారాన్ని ఇరు దేశాలు పెంపొందించుకుంటున్నాయని తెలిపారు. భారత్‌–అమెరికా సంబంధాలనే శ్రావ్యమైన గానాన్ని ఇరుదేశాల పౌరులే స్వరపర్చారని కొనియాడారు. రెండు దేశాల మైత్రి బలపడానికి భారతీయ–అమెరికన్‌ అయిన కమలా హ్యారిస్‌ ఎంతగానో కృషి చేస్తున్నారని మోదీ కొనియాడారు. ఈ విందులో అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌ పాల్గొన్నారు.  

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top