
అమెరికా అనూహ్య నిర్ణయం
‘డెడ్ హ్యాండ్’హెచ్చరికలకు ప్రతిగానే
మాస్కో: అగ్ర రాజ్యాలు అమెరికా, రష్యా మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. శుక్రవారం అమెరికా రెండు అణు జలాంతర్గాములను రష్యా సమీపంలో మోహరించింది. ఈ మేరకు ఆదేశాలు జారీ చేసినట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన సోషల్ మీడియా హాండిల్ ట్రూత్ సోషల్‌లో ప్రకటించారు. అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సహాయకుడు, రష్యా సెక్యూరిటీ కౌన్సిల్ డిప్యూటీ చైర్మన్ ద్మిత్రీ మెద్వెదెవ్ చేసిన ‘డెడ్ హ్యాండ్’ హెచ్చరికలకు ప్రతిస్పందనగా ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. ‘‘అవి మతిలేని, రెచ్చగొట్టే ప్రకటనలు. నిజంగానే అలాంటి పరిస్థితి తలెత్తే ఆస్కారముంటే దీటుగా స్పందించేందుకే ఈ నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చింది. రెండు సబ్‌మెరైన్లను సరైన ప్రదేశాల్లో మోహరించాల్సిందిగా ఆదేశించా’’అని వివరించారు.
ఏమిటీ డెడ్ హ్యాండ్?
ఇది రష్యా (నాటి సోవియట్ యూనియన్) అభివృద్ధి చేసిన ప్రచ్ఛన్న యుద్ధకాలం నాటి వ్యవస్థ. ఆ దేశంపై ఎవరన్నా అణు దాడి చేస్తే అందుకు ప్రతిగా ఆటోమేటిగ్గా అణు దాడులు జరుపుతుంది. దేశ నాయకత్వం పూర్తిగా తుడిచిపెట్టుకు పోయినా తనంత తానుగా స్పందించి దాడులకు దిగటం దీని ప్రత్యేకత.
భూమిపై ఎక్కడైనా కొట్టగల క్షిపణి: రష్యా
మాస్కో: అత్యాధునిక హైపర్‌సోనిక్ క్షిపణులను యుద్ధప్రాతిపదికన అభివృద్ధి చేస్తున్నట్టు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రకటించారు. ఈ ఏడాది చివర్లో వాటిని బెలారస్‌లో మోహరించే యోచన ఉందని తెలిపారు. రష్యాకు అత్యంత సన్నిహిత దేశమైన బెలారస్ అధ్యక్షుడు అలెగ్జండర్ లుకషెంకోతో కలిసి సెయింట్ పీటర్స్‌బర్గ్ సమీపంలో పుతిన్ మీడియాతో మాట్లాడారు. ‘‘ఈ క్షిపణులకు సంబంధించిన పనులు చురుగ్గా సాగుతున్నాయి. సంవత్సరాంతానికి ఉత్పత్తి్త మొదలవుతుంది. ఉక్రెయిన్‌తో యుద్ధంలో ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి ఒరెíÙ్నక్, దానికి సంబంధించిన ఆయుధ వ్యవస్థలను గత అక్టోబర్‌లో పుతిన్ రంగంలోకి దించారు. ఆ సందర్భంగా ఒరెషి్నక్ సామర్థ్యాలను ప్రస్తుతించారు. ‘‘సంప్రదాయ, అణు వార్‌హెడ్లు రెండింటినీ మోసుకెళ్లగలగడం దీని ప్రత్యేకత. లక్ష్యం భూమిపై ఎక్కడున్నా ఇప్పటికైనా ఈ క్షిపణులు ఆదుకోవాల్సిందే. ఇవి దాదాపుగా మాక్10 వేగంతో దూసుకెళ్తాయి.