1.2 బిలియన్‌ డాలర్ల పరిహారానికి ఆదేశించిన యూఎస్‌ కోర్టు

US Court Orders Antrix To Pay Very Big Compensation To Devas - Sakshi

వాషింగ్టన్‌ : ఇస్రో భాగస్వామి ఆంట్రిక్స్‌ కార్పోరేషన్‌పై దేవాస్‌ మల్టీమీడియా లిమిటెడ్‌ ఎట్టకేలకు విజయం సాధించింది. 2005 శాటిలైట్‌ ఒప్పందం రద్దు చేసుకున్నందుకు గానూ 1.2 బిలియన్‌ డాలర్లు పరిహారంగా చెల్లించాలని యూఎస్‌ కోర్టు ఆంట్రిక్స్‌ను ఆదేశించింది. 2005 జనవరిలో రెండు శాటిలైట్ల తయారీ, ప్రయోగం, ఆపరేషన్స్‌కు సంబంధించి ఆంట్రిక్స్‌.. దేవాస్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. అయితే 2011 ఫిబ్రవరిలో దేవాస్‌తో కుదుర్చుకున్న ఒ‍ప్పందాన్ని రద్దు చేసుకుంటున్నట్లు ఆంట్రిక్స్‌ ప్రకటించింది. ( ఫ్యూచర్‌ మహమ్మారులు మరింత డేంజర్‌..!)

దీంతో దేవాస్‌ న్యాయ పోరాటం మొదలుపెట్టింది. దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టును ఆశ్రయించగా ట్రిబ్యునల్‌ ఏర్పాటుకు కోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో 2018 సెప్టెంబర్‌లో అమెరికన్‌ కోర్టును ఆశ్రయించింది. వాషింగ్టన్‌ న్యాయస్థానం ఈ నెల అక్టోబర్‌ 27న కేసుపై విచారణ జరిపి తుది తీర్పును వెలువరించింది. ఆంట్రిక్స్‌ కార్పోరేషన్‌ దేవాస్‌ మల్టీమీడియాకు 562.5 మిలియన్‌ డాలర్లు పరిహారం చెల్లించాలని, వడ్డీతో కలిపి 1.2 బిలియన్‌ డాలర్ల చెల్లించాలని ఆదేశించింది.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top