హెచ్‌1బీ శిక్షణకు 1,105 కోట్లు

US announces 150 million Dollers for H1B One Workforce training - Sakshi

వాషింగ్టన్‌: హెచ్‌1బీ వీసాలపై వివిధ రకాల ఉద్యోగాలు చేయడానికి వచ్చే మధ్యస్త, ఉన్నత స్థాయి నైపుణ్యాలు గల వారికి శిక్షణ ఇచ్చేందుకు అమెరికా ప్రభుత్వం రూ.1,105 కోట్లు ఖర్చు చేయనుంది. ఐటీ, సైబర్‌ సెక్యూరిటీ, అడ్వాన్స్‌డ్‌ మాన్యుఫాక్చరింగ్, రవాణా తదితర రంగాల్లో హెచ్‌–1బీ వీసా హోల్డర్లు ఎక్కువగా ఉంటారు. వీరిలో నైపుణ్యం పెంచేందుకు తాజా పెట్టుబడులు ఉపయోగపడతాయని కార్మిక శాఖ తెలిపింది. ఈ కార్యక్రమంతో భారతీయ నిపుణులు ఎక్కువగా లాభం పొందనున్నారు.  

విద్యార్థులు, పరిశోధకుల వీసాలకు నిర్ణీత గడువు
విదేశీ పరిశోధకులు, విద్యార్థులు, జర్నలిస్టులకు ఇచ్చే వీసాలకు నిర్ణీత గడువు విధించాలని ట్రంప్‌ ప్రభుత్వం యోచిస్తోంది. ప్రస్తుతమున్న సులువైన వీసా విధానం దుర్వినియోగం అవుతోందనీ, దీనివల్ల జాతీయ భద్రతకు ప్రమాదం పొంచి ఉందని పేర్కొంది. పైన పేర్కొన్న మూడు రకాల వీసాలతో చైనీయులే ఎక్కువగా లబ్ధి పొందుతున్నారు. అయితే, నూతన విధానం ఏ ఒక్క దేశాన్నో లక్ష్యంగా చేసుకున్నది కాదని ప్రభుత్వం అంటోంది.   తాజా ప్రతిపాదనల ప్రకారం.. నాన్‌ ఇమిగ్రాంట్‌ విభాగంలోని ఎఫ్, జే (విద్యార్థులు, పరిశోధకుల) వీసాల కాలపరిమితి నాలుగేళ్లు మాత్రమే ఉంటుంది.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top