భారత్‌పై అమెరికా, ఆస్ట్రేలియా విమర్శలు!

US and Australia Criticized India Considering Russian Proposal  - Sakshi

Deeply Disappointing India For Russia Proposals: ఉ‍క్రెయిన్‌ పై దురాక్రమణకు దిగుతున్న రష్యాకు అడ్డుకట్టవేసేలా ప్రపంచ దేశాలన్ని ఆంక్షలతో రష్యాని ఒంటరిని చేయాలని చూస్తున్నాయి. అయితే దానికి విరుద్ధంగా రష్యాతో వ్యూహాత్మక సంబంధాలను నెరుపుకుంటున్నందుకు భారత్‌పై అమెరికా, ఆస్ట్రేలియా దేశాలు నిప్పులు చెరుగుతున్నాయి. అదీగాక ఇటీవలే చైనా విదేశాంగ మంత్రి  వాంఘీ, భారత్‌ పర్యటనకు వచ్చి చర్చలు జరపడంతో అమెరికా దాని మిత్రదేశాలు తీవ్ర అసహనం వ్యక్తం చేశాయి. మరొకవైపు రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్‌రోవ్‌..భారత్‌ పర్యటనకు రావడం ఇప్పుడు మరింత హాట్‌ టాపిక్‌ అయ్యింది. దీనిపై అమెరికాతో సహా దాని మిత్ర దేశాలు గుస్సా అవుతున్నాయి. 

ప్రస్తుతం అమెరికా, దాని మిత్ర దేశాలు ఉక్రెనియన్‌ మద్దతుగా నిలబడే సమయం ఆసన్నమైందని, రష్యా అధ్యక్షుడు పుతిన్‌ యుద్ధానికి ఎలాంటి సాయం చేయవద్దు అని యూఎస్‌ వాణిజ్య కార్యదర్శి  గినా రైమోండో వాషింగ్టన్‌లో పిలుపినిచ్చారు. అలాగే ఆస్ట్రేలియా వాణిజ్యమంత్రి డాన్‌ టెహన్‌ రెండోవ ప్రపంచ యుద్ధం నుంచి కలిగి ఉన్న నిబంధనల ఆధారిత విధానాన్ని కొనసాగించడాని​కి ప్రజాస్వామ్య దేశాలు కలిసి పనిచేయడం అత్యంత ముఖ్యం అని నొక్కి చెప్పారు.  

ఆసియా పసిఫిక్‌ ప్రాంతాల్లో చైనా ప్రభావాన్ని ఎదుర్కొవడానికి ప్రయత్నిస్తున్న క్వాడ్‌లోని సభ్యదేశాలు యూఎస్‌ , ఆస్ట్రేలియా, జపాన్‌లు భారత్‌ తీరు పట్ల తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశాయి. అదీగాక రష్యా ఆయుధాలను ప్రపంచంలోనే అత్యధికంగా కొనుగోలు చేసే దేశం భారతదేశం. పైగా ఇంధన ధరలు పెరగడంతో రష్యా నుంచి చవకగా చమురును కొనుగోలు చేయాలని కూడా చూస్తోంది. దీంతో భారత్‌ పట్ల అగ్రదేశం దాని మిత్రదేశాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

ప్రపంచ దేశాలు అంతర్జాతీయపరంగా రష్యాని ఆర్థికంగా దెబ్బతీసేలా స్విఫ్ట్‌ నుంచి రష్యా బ్యాంకులను తొలగించింది. అంతేగాక బెల్జియం ఆధారిత క్రాస్-బోర్డర్ చెల్లింపు సిస్టమ్ ఆపరేటర్‌ను ఉపయోగించకుండా యూఎస్‌, యూరోపియన్ యూనియన్ ఏడు రష్యన్ బ్యాంకులను నిషేధించింది. అయితే భారత్‌ మాత్రం స్విఫ్ట్‌కి ప్రత్యామ్నాయాన్ని ఉపయోగించే రూపాయి-రూబుల్-డినామినేటెడ్ చెల్లింపులు చేసే ప్రణాళికను భారత్‌ పరిశీలిస్తున్నట్లు పేర్కొనడం గమనార్హం.

జపాన్ ప్రధాని ఫుమియో కిషిడా, ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్ ఉక్రెయిన్‌లో పరిస్థితి గురించి భారత్‌ ప్రధాని మోదీతో చర్చించారు కూడా. అంతేగాక  బుధవారం అమెరికా విదేశాంగ కార్యదర్శి ఆంటోనీ బ్లింకెన్ భారత విదేశంగా కార్యదర్శి  సుబ్రహ్మణ్యం జైశంకర్‌తో ఫోన్‌లో ఉక్రెయిన్‌లో నానాటికి దిగజారుతున్న పరిస్థితిపై ఫోన్‌లో సంభాషించారు కూడా. ఇటీవల  చైనా విదేశాంగ మంత్రి భారత్‌ పర్యటన విషయమై బ్రిటన్‌ విదేశంగ మంత్రి రష్యాపై వ్యూహాత్మకంగా ఆధారపడటాన్ని తగ్గించుకోవాలంటూ భారత్‌కి చురకలంటించింది.

(చదవండి: యుద్ధం ఆపేలా పుతిన్‌ని భారత ప్రధాని ఒప్పిస్తే సంతోషిస్తాం: ఉక్రెయిన్‌ మంత్రి)

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top