వాషింగ్టన్‌ ఇజ్రాయెల్‌ ఎంబసీ.. అమెరికా ఎయిర్‌ఫోర్స్‌ ఉద్యోగి ఆత్మహత్యాయత్నం

Us Airforce Man Set Ablaze Himself Infront Of Israel Embassy - Sakshi

వాషింగ్టన్‌: అమెరికా ఎయిర్‌ఫోర్స్‌ ఉద్యోగి ఒకరు వాషింగ్టన్‌లోని ఇజ్రాయెల్‌ రాయబార కార్యాలయం ముందు ఆత్మహత్యాయత్నం చేశాడు. తనకు తాను మంటలంటించుకున్నాడు. మంటల్లో కాలుతూ ఫ్రీ పాలస్తీనా అని నినాదాలు చేశాడు. మంటలంటించుకునే మందు అతడు మాట్లాడుతూ ‘గాజాపై ఇజ్రాయెల్‌ చేస్తున్న మారణహోమంలో ఇక ఏ మాత్రం నేను భాగం కాను. ఇందుకే నిరసనగా ఆత్మహత్య చేసుకుంటున్నాను’అని చెప్పాడు.

ఈ వీడియో ట్విట్చ్‌ ప్లాట్‌ఫామ్‌లో ప్రత్యక్ష ప్రసారమైంది. వెంటనే అధికారులు  వీడియోను డిలీట్‌ చేయించారు. ఘటన అనంతరం మంటలార్పి ఆ వ్యక్తిని ఆస్పత్రికి తరలించారు. ఆత్మహత్యాయత్నం చేసిన వ్యక్తి ప్రస్తుతం ఆస్పత్రిలో  చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. యూనిఫాం వేసుకుని తనను తాను కాల్చుకున్న వ్యక్తి అమెరికాలోని టెక్సాక్‌కు చెందిన ఎయిర్‌ఫోర్స్‌ ఉద్యోగి అని అధికారులు నిర్ధారించారు.   

ఇదీ చదవండి.. దుస్తులపై వివాదం.. మహిళపై మూకదాడికి యత్నం

whatsapp channel

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram


 

Read also in:
Back to Top