పాక్‌లో మహిళపై మూక దాడికి యత్నం.. కాపాడిన మహిళా పోలీసు

Mob Lynching Of  A Woman In Pakistan Lahore - Sakshi

ఇస్లామాబాద్‌: దుస్తులపై అరబిక్‌ భాషలో ఖురాన్‌ను కించపరిచే రాతలున్నాయన్న ఆరోపణలపై పాకిస్థాన్‌లోని లాహోర్‌లో ఓ యువతిని కొందరు చుట్టుముట్టారు. వెంటనే ఓ మహిళా పోలీసు ఆ యువతిని ఆ మూక నుంచి రక్షించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. గుంపు చుట్టుముట్టినపుడు యువతి  తన ముఖం కనిపించకుండా చేతులు అడ్డం పెట్టుకుంది.

ఈ సమయంలో ఓ మహిళా పోలీసు వచ్చి ధైర్యంగా ఆమెను రక్షించి అక్కడి నుంచి తీసుకెళ్లడం వీడియోలో కనిపిస్తోంది. ఈ వీడియెను ఆ మహిళా పోలీసును ఉద్దేశించి పాకిస్థాన్‌ పంజాబ్‌ పోలీసులు ఎక్స్‌(ట్విటర్‌)లో పోస్ట్‌ చేశారు. ఆమె పేరును ప్రతిష్టాత్మక క్వాడ్‌ ఈ అజామ్‌ పోలీస్‌ మెడల్‌కు రిఫర్‌ చేస్తున్నట్లు తెలిపారు. ఈ ఘటనపై ఆ మహిళా పోలీసు మాట్లాడుతూ ‘అరబిక్‌లో ఏవో పదాలు రాసి ఉన్న దుస్తులు వేసుకున్న మహిళ ఆమె భర్తతో కలిసి షాపింగ్‌కు వచ్చింది. ఆమె ధరించిన కుర్తాపై అరబిక్‌లో ఏదో రాసి ఉంది.  వెంటనే ఆ మహిళ దగ్గరకు కొందరు వచ్చి కుర్తాను తీసేయాలని కోరారు.

దీనికి స్పందించిన ఆ మహిళ డిజైన్‌ బాగున్నందునే వాటిని కొన్నాననని సమాధానమిచ్చింది. తనకు ఖురాన్‌ను కించపరిచే ఉద్దేశమేమీ లేదని స్పష్టం చేసింది’ అని మహిళా పోలీసు  తెలిపింది. అయితే మరికొందరు మాత్రం మహిళ ధరించిన దుస్తులపై ఖురాన్‌పై ఎలాంటి కించపరిచే రాతలు లేవని సోషల్‌ మీడియలో పోస్టులు చేశారు. ఇటీవలి కాలంలో దేశంలో మతం పేరు మీద మాబ్‌ లించింగ్‌ పెరిగిపోయిందని, రాజకీయాల కోసమే కొందరు వీటిని ప్రోత్సహిస్తున్నారని కామెంట్స్‌ చేస్తున్నారు. 

ఇదీ చదవండి.. చైనాలో 24 కోట్ల ఏళ్ల డ్రాగన్‌ శిలాజం

whatsapp channel

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram


 

Read also in:
Back to Top