
శాంటా లుకా: దక్షిణ అమెరికా దేశం ఈక్వెడార్‌లోని ఓ నైట్ క్లబ్‌లో ఆదివారం చోటు చేసుకున్న కాల్పుల ఘటనలో 8 మంది ప్రాణాలు కోల్పోగా ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. తీరప్రాంత గుయాస్ ప్రావిన్స్‌లోని శాంటా లుకాలో ఈ ఘటన చోటుచేసుకుంది.
బాధితులంతా 20–40 ఏళ్ల వారేనని పోలీసులు తెలిపారు. దేశంలో అత్యంత ప్రమాదకరమైన ప్రాంతంలో ఒకటిగా దీనికి పేరుంది. రెండు మోటారు సైకిళ్లపై వచ్చిన సాయుధులైన దుండగులు కాల్పులకు తెగబడ్డారని పోలీసులు వెల్లడించారు. కారణాలు తెలియాల్సి ఉందన్నారు.