ఇజ్రాయెల్‌ ఎంబసీ వద్ద నిప్పంటించుకొని ఎయిర్‌ ఫోర్స్‌ ఉద్యోగి మృతి

US Airman Deceased After Setting Himself On Fire Over Gaza - Sakshi

వాషింగ్టన్‌: గాజాలో ఇజ్రాయెల్‌ చేస్తున్న దాడులకు నిరసన తెలుపుతూ నిప్పంటించుకున్న అమెరికా ఎయిర్‌ ఫోర్స్‌ ఉద్యోగి మరణించాడు. సోమవారం ఈ విషయాన్ని పెంటాగన్‌ వర్గాలు ఓ ప్రకటనలో పేర్కొన్నాయి. ఆదివారం రాత్రి ఇజ్రాయెల్‌ ఎంబసీ ముందు మంటలు చెలరేగినట్లు ఫైర్‌ సిబ్బందికి సమాచారం అందింది. వెంటనే స్పందించిన ఫైర్‌ సిబ్బంది ఇజ్రాయెల్‌ ఎంబసీ వద్దకు చేరుకున్నారు.

అక్కడ ఓ వ్యక్తి తనకు తాను నిప్పు పెట్టుకోవటం వల్ల మంటల్లో చిక్కుకున్నాడు. మంటలు ఆర్పిన ఫైర్‌ సిబ్బంది... అతనికి తీవ్రమైన గాయాలు కావటంతో స్థానిక ఆస్పత్రికి తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉ‍న్నట్లు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. చికిత్స అందిస్తున్న సమయంలో అతను మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.  

‘పాలస్తీనాను విడిచిపెట్టండి’.. ‘మారణహోమంలో పాలుపంచుకోవద్దు’.. అంటూ నినాదాలు చేస్తూ సదరు వ్యక్తి తనకు తాను నిప్పంటించుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌మీడియా వైరల్‌గా మారింది.  

దీంతో అమెరికా ఎయిర్‌ ఫోర్స్‌ స్పందించి.. నిరసన తెలుపుతూ నిప్పుపెట్టుకొని మృతి చెందన వ్యక్తి తమ డిపార్టుమెంట్‌కు చెందిన  ఆరోన్ బుష్నెల్ అని గుర్తించారు. అయితే అతను ఎయిర్‌ ఫోర్స్‌లో ఏ స్థాయికి చెందని ఉద్యోగి, ర్యాంక్‌ ఏంటి? వంటి వివరాలు తెలియజేడానికి నిరాకరించింది. 

మరోవైపు.. ఇజ్రాయెల్‌​ ఎంబసీకి సంబంధించిన సిబ్బందికి ఈ ఘటనలో ఎటువంటి ప్రమాదం జరగలేదని ఎంబసీ అధికార ప్రతినిధి పేర్కొన్నారు.  అతను గుర్తు తెలియని  వ్యక్తి అని తెలిపారు.

whatsapp channel

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram


 

Read also in:
Back to Top