Russia Ukraine Crisis: ట్రంప్‌ సంచలన వ్యాఖ్యలు.. బైడెన్‌, నాటో బలహీనత వల్లే..

Ukraine War: Trump Says Problem Is Not That Putin Smart But Our Leaders Dumb - Sakshi

ఉక్రెయిన్‌పై రష్యా సైనిక దాడులు నాలుగో రోజూ కూడా కొనసాగుతున్నాయి. వ్యూహాత్మక నరగం నోవా కఖోవ్‌కాను రష్యా సైన్యం స్వాధీనం చేసుకుంది. ఉక్రెయిన్‌పై మిస్సైళ్లలో రష్యా బలగాలు విరుచుకుపడుతున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌, నాటో కూటమిపై త్రీవస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఫ్లోరిడాలోని ఓర్లాండోలో జరిగిన కన్జర్వేటివ్ పొలిటికల్ యాక్షన్ కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడుతూ.. అగ్రరాజ్య అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ బలహీనత కారణంగానే రష్యా.. సరిహద్దు దేశమైన ఉక్రెయిన్ సైనిక దాడులు చేస్తోందని ఆరోపించారు.

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అవకతవకలు జరగకపోతే ఈ భయంకరమైన విపత్తు జరిగేది కాదని అన్నారు. ముఖ్యంగా తాను అమెరికా అధ్యక్షునిగా ఉంటే రష్యా, ఉక్రెయిన్‌పై సైనిక దాడికి పాల్పడేది కాదని పేర్కొన్నారు. మరోవైపు రష్యా అధ్యక్షుడు పుతిన్ తెలివైనవాడు అంటూ.. అమెరికా పాలకులు (బైడెన్‌ను ఉద్దేశిస్తూ) మూర్ఖులంటూ దుయ్యబట్టారు. తాను 2024 అధ్యక్ష ఎన్నికల్లో మళ్లీ పోటీ చేసే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు.

తూర్పు ఉక్రెయిన్‌లోని రష్యా మద్దతుగల వేర్పాటువాద ప్రాంతాలు డోనెట్స్క్‌, లుహాన్స్క్‌లను రష్యా ప్రధాని వ్లాదిమిర్‌ పుతిన్‌ స్వతంత్ర ప్రాంతాలుగా గుర్తిస్తున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిపై  ట్రంప్‌ స్పందిస్తూ.. ‘‘ఉక్రెయిన్ లోని భారీ భూభాగాన్ని స్వతంత్ర రాజ్యాలుగా పుతిన్ ప్రకటించడం అద్భుతమైన చర్య. రెండు స్వతంత్ర రాజ్యాలుగా విడగొట్టి పుతిన్ శాంతి కాముకుడిగా చరిత్రలో నిలిచిపోయాడు’ అని ట్రంప్‌ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. డొనాల్డ్‌ ట్రంప్‌.. పుతిన్‌ను తెలివైన వ్యక్తిగా అభివర్ణించడాన్ని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ తప్పు​పట్టారు. పుతిన్‌ను తెలివైన వ్యక్తిగా చెబుతూ.. తనను తాను మేధావిగా ట్రంప్‌ ప్రకటించుకుంటున్నాడని బైడెన్‌ ఎద్దేవా చేశారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top