ఎంపీ పదవికి సైతం రాజీనామా చేసిన బోరిస్ జాన్సన్

UK Ex Prime Minister Boris Johnson Resigns As MP - Sakshi

లండన్: లాక్ డౌన్ సమయంలో నింబంధనలను ఉల్లంఘించిన కేసులో విచారణకు సంబంధించి బ్రిటన్ ప్రివిలేజెస్ కమిటీ నివేదికను సిద్ధం చేసిన నేపథ్యంలో బ్రిటన్ మాజీ ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్ తన ఎంపీ పదవికి రాజీనామా చేశారు. అనంతరం మీడియా సమావేశాన్ని నిర్వహించి పార్లమెంటును విడిచి వెళ్లడం చాలా బాధాకరంగా ఉందని అన్నారు.

కరోనా సమయంలో బ్రిటన్ ప్రధానిగా ఉండి కూడా నిబంధనలను ఉల్లంఘించినందుకు అభియోగాలను ఎదుర్కొంటున్న బోరిస్ జాన్సన్ 2022లోనే ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేశారు. కానీ ఎంపీగా మాత్రం కొనసాగుతూ ఉన్నారు. మరికొద్ది రోజుల్లో ప్రివిలేజెస్ కమిటీ నివేదికను సమర్పించనున్న నేపథ్యంలో నివేదిక రాకముందే బోరిస్ జాన్సన్ తన ఎంపీ పదవికి రాజీనామా చేయడం చర్చనీయాంశమైంది.  

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. పార్లమెంటును విడిచి వెళ్లడం చాలా బాధగా ఉంది. నాపై నిరాధారమైన ఆరోపణలు చేస్తూ కొంతమంది నన్ను ఎలాగైనా ఈ హౌస్ నుంచి పంపించేయాలని ప్రయత్నం చేస్తున్నారు. కమిటీ నివేదిక రాకముందే వారు ఆలా చేయడం దురదృష్టకరమని అన్నారు.   

సుదీర్ఘకాలం పాటు సాగిన విచారణలో ప్రివిలేజెస్ కమిటీ అనేక విషయాలను పరిగణనలోకి తీసుకుంది. బోరిస్ జాన్సన్ తాను  నివాసముంటున్న 10 డౌనింగ్ స్ట్రీట్ లో లాక్ డౌన్ నింబంధనలకు వ్యతిరేకంగా మద్యం పార్టీ చేసుకుని నిబంధనలను ఉల్లంఘించి, అనంతరం తప్పుడు నివేదికలతో పార్లమెంటును కూడా తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారన్నవి ఆయనపై ఉన్న ప్రధాన అభియోగాలు. 

ఇది కూడా చదవండి: భారత విద్యార్థులకు భరోసానిచ్చిన కెనడా ప్రధాని

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top