ఒక సుందరి, 100 కోట్ల డాలర్లు! | Uganda Army Chief Sparks Controversy | Sakshi
Sakshi News home page

ఒక సుందరి, 100 కోట్ల డాలర్లు!

Apr 13 2026 9:11 AM | Updated on Apr 13 2026 9:11 AM

Uganda Army Chief Sparks Controversy

అంకారా: ఉగాండా అధ్యక్షుడు యెవొరి ముసవెని కుమారుడు, దేశ ఆర్మీ చీఫ్‌ ముహూజి కైనెరుగబా మరోసారి వింత డిమాండ్లు వినిపించారు. ఈసారి తుర్కియేను లక్ష్యం చేసుకున్నారు. ‘‘సోమాలియాలో ఆ దేశం పొందిన ప్రయోజనాలకు ప్రతిగా తనకు తుర్కియేలోనే అత్యంత అందగత్తెను బహుమతిగా ఇవ్వాలి. అలాగే ఓ వంద కోట్ల డాలర్లు కూడా సమరి్పంచుకోవాలి’’ అని డిమాండ్‌ చేశారు! ‘‘‘సోమాలియాలో అల్‌ కాయిదా, ఐఎస్, అల్‌ షబాబ్‌ వంటి సాయుధ ఇస్లామిక్‌ గ్రూపులతో పోరాడే బాధ్యత మా సైనికులది, లాభాలేమో తుర్కియేకా? ముప్పై రోజుల్లోగా నా కోరికలు తీర్చకపోతే తుర్కియేతో దౌత్య సంబంధాలను తెంచేసుకుంటాం. 

మా దేశంలోని తుర్కియే ఎంబసీని మూసేస్తాం. మా గగనతలంలోకి తుర్కియే విమానాలను రానివ్వబోం. మాకు వెన్నుపోటు పొడవాలని చూస్తే ఇజ్రాయెల్‌కు మద్దతిచ్చేందుకు సిద్ధంగా ఉన్నాం. ఏసు పవిత్ర భూమిని కాపాడేందుకు ఆ దేశానికి లక్ష మంది ఉగాండా సైనికులను పంపుతాం’’ అని కైనెరుగబా అన్నారు. ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీని పెళ్లి చేసుకుంటానంటూ 2022లో ఆయన ఇలాగే గొంతెమ్మ కోరిక కోరారు! 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement