అమెరికా: స్కూల్లో కత్తులతో దాడి.. ఇద్దరు విద్యార్థులకు గాయాలు! | California High School Stabbing Leaves Two Students Injured As Police Detain Two Suspects, Check Out More Details Inside | Sakshi
Sakshi News home page

అమెరికా: స్కూల్లో కత్తులతో దాడి.. ఇద్దరు విద్యార్థులకు గాయాలు!

Oct 29 2026 8:57 AM | Updated on Oct 29 2026 10:49 AM

Two students stabbed in California high school

కాలిఫోర్నియా: అమెరికాలోని కాలిఫోర్నియాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఎల్క్ గ్రోవ్‌లోని ప్లెజెంట్ గ్రోవ్ హైస్కూల్‌లో విద్యార్థుల మధ్య జరిగిన గొడవ కత్తిపోట్లకు దారితీసింది. ఈ ఘటనలో ఇద్దరు విద్యార్థులు గాయపడగా.. వారిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఎల్క్ గ్రోవ్ పోలీస్ శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. విద్యార్థుల మధ్య జరిగిన ఘర్షణలో ఇద్దరిపై కత్తితో దాడి జరిగింది. బాధితులిద్దరిపై ఒకే వ్యక్తి దాడి చేసి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. అయితే, అదుపులోకి తీసుకున్న ఇద్దరూ విద్యార్థులేనా? అనే విషయం ఇంకా స్పష్టత రాలేదు. ఘటనాస్థలంలో పోలీసులు ఒక కత్తిని స్వాధీనం చేసుకున్నారు.

ఈ ఘటన నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా హైస్కూల్‌తో పాటు పక్కనే ఉన్న జూనియర్ హైస్కూల్‌లోనూ లాక్‌డౌన్‌ విధించారు. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చిన తర్వాత ఆంక్షలను ఎత్తివేశారు. ఘటన జరిగిన సమయంలో విద్యార్థులకు ఆ రోజు తరగతులు ముగిసి, ఇళ్లకు వెళ్లే సమయం కూడా అయిపోయిందని ఎల్క్ గ్రోవ్ యూనిఫైడ్ స్కూల్ డిస్ట్రిక్ట్ వెల్లడించింది. 

ఇదీ చదవండి: ‘ఫ్లైదుబాయ్’లో పైలట్ మచ్చార్‌కు గాయమైంది ఇక్కడే..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement