రష్యా డ్రోన్ దాడులను తిప్పికొట్టిన ఉక్రెయిన్

Two Injured In Odesa As Moscow Launches Drone Attack On Port - Sakshi

క్యివ్: దక్షిణ ఉక్రెయిన్ ప్రాంతమైన ఒడెస్సాపై రష్యా శనివారం మొత్తం 25 డ్రోన్లతో దాడి చేసింది. ఉక్రెయిన్ గగనతల రక్షణ వ్యవస్థ వాటిలో 22 డ్రోన్లను సమర్ధవంతంగా కూల్చేసినట్లు తెలిపింది ఉక్రేయి రక్షణ శాఖ. ఈ దాడుల్లో ఒడెస్సాలో దానుబే నది వద్దనున్న రెనీ పోర్టులో కొద్దిపాటి విధ్వంసం చోటు చేసుకుంది. 

యుద్ధ ప్రారంభ రోజులతో పోలిస్తే ఉక్రెయిన్ రష్యా దాడులను సమర్థవంతంగానే తిప్పి కొడుతోంది. ఒక పక్క రష్యా దాడులను అడ్డుకుంటూనే మరోపక్క వారిపై ఎదురుదాడి చేస్తోంది.  ఇప్పటికే రష్యా చెరలో నుండి అనేక ప్రాంతాలను తిరిగి స్వాధీనం చేసుకున్న ఉక్రెయిన్ తాజాగా పోర్టు ప్రాంతంలో రష్యా ప్రయోగించిన ఇరాన్ షాహెద్ డ్రోన్లను చిత్తు చేసింది. మొత్తం 25 డ్రోన్లలో 22 డ్రోన్లను నేలకూల్చినట్లు తెలిపింది ఉక్రెయిన్ రక్షణ శాఖ.  

ఈ దాడుల్లో ఇద్దరు గాయపడగా అక్కడక్కడా ఇఇన్‌ఫ్రాస్ట్రక్చర్ దెబ్బ తిన్నట్లు వెల్లడించింది ఉక్రెయిన్ సైన్యం. పోర్టు ప్రాంతమైన ఒడెస్సా పోర్టు నుంచి ఉక్రెయిన్ ధాన్యం ఎగుమతి  చేసేది. నౌకాశ్రయంలో జరిగిన నష్టం ఎంతనేది ఇప్పుడే చెప్పలేమంది సైన్యం. ఈ పోర్టు ధ్వంసం చేసి ధాన్యం రవాణాను దెబ్బతీయాలన్నది రష్యా ఉద్దేశ్యమై ఉంటుందని తెలిపింది. 

ఇది కూడా చదవండి: సైనికులు ప్రాణాలు పోతుంటే..పుతిన్‌ పట్టనట్లు చేస్తున్న పని చూస్తే..షాకవ్వతారు

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top