లండన్: బ్రిటన్‌లోని యార్క్‌షైర్ వైల్డ్‌లైఫ్ పార్క్‌లో జరిగిన ఘోర ప్రమాదానికి సంబంధించిన వీడియోను డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. పార్క్‌లోని పులుల ఎన్‌క్లోజర్‌లోకి ప్రవేశించిన 23 ఏళ్ల విలియం చాప్మన్ అనే యువకుడిపై పులి దాడి చేసి ప్రాణాలు తీసింది. ఈ భయానక 41 సెకన్ల దృశ్యాలను ట్రంప్ తన ట్రూత్ సోషల్ ఖాతాలో షేర్ చేస్తూ ‘ప్రకృతితో ఎప్పుడూ పెట్టుకోవద్దు!’అని వ్యాఖ్యానించారు.
ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోయిన సున్నితమైన సంఘటనను, అందులోని తీవ్రమైన హింసను ఏమాత్రం పట్టించుకోకుండా ట్రంప్ ఈ వీడియోను పోస్ట్ చేయడంపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ట్రంప్ మద్దతుదారులు సైతం ఈ పోస్ట్‌ను తప్పుబడుతున్నారు. ఈ వీడియో వైరల్ కావడంతో పాటు ఏఐ సాయంతో రూపొందించిన ఇలాంటి మరికొన్ని దృశ్యాలు ప్రచారంలోకి రావడంపై విమర్శలు మరింత వెల్లువెత్తాయి.
https://t.co/5Rz7TQow2b
— Rapid Response 47 (@RapidResponse47) October 13, 2026
ఈ పరిణామాలపై మృతుడు విలియం కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. విలియం కొన్నేళ్లుగా తీవ్రమైన మానసిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నాడని, వైద్యుల పర్యవేక్షణలో ఔషధాలు తీసుకుంటున్నాడని వారు వెల్లడించారు. పుత్రశోకంలో ఉన్న తమ కుటుంబాన్ని ఇలాంటి భయానక వీడియోల సర్క్యులేషన్ మరింత వేధిస్తోందని వారు వాపోయిన వారు. కాగా ఈ ఘటనకు కారణమైన ‘అల్టాయ్’ అనే పులిని చంపబోమని పార్క్ యాజమాన్యం స్పష్టం చేసింది. ఇది అంతరించిపోతున్న అరుదైన అముర్ జాతికి చెందినదని, ప్రపంచవ్యాప్తంగా అడవుల్లో వీటి సంఖ్య దాదాపు 500 మాత్రమే ఉందని నిర్వాహకులు తెలిపారు. యువకుడు రక్షిత ప్రాంతంలోకి ఎలా ప్రవేశించాడనే అంశంపై స్థానిక డాన్‌కాస్టర్ కౌన్సిల్ అధికారులు సమగ్ర దర్యాప్తు ప్రారంభించారు.
ఇదీ చదవండి: ట్రంప్‌కు దిమ్మతిరిగే షాకిచ్చిన కొత్త ప్రెస్ సెక్రటరీ


