వారి చేతికి కూడా తుపాకీ ఇవ్వండి: ట్రంప్‌

Trumps Solution To Stop Mass Shootings In US - Sakshi

A good guy with a gun: టెక్సాస్‌ యువాల్డే రాబ్‌ ఎలిమెంటరీ స్కూల్‌ మారణహోమం గురించి అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ట్రంప్‌ హ్యూస్టన్‌లోని నేషనల్ రైఫిల్ అసోసియేషన్ సమావేశంలో మాట్లాడుతూ...తుపాకితో కాల్పులకు పాల్పడుతున్న చెడ్డ వ్యక్తిని నియంత్రించాలంటే మంచి వ్యక్తి కూడా తుపాకిని చేతబట్టాల్సిందేనని అన్నారు. ముల్లుని ముల్లుతోనే తీయాలన్న సామెత మాదిరి అలాంటి నరమేధాన్ని ఆపాలంటే మంచివాళ్లకు కూడా తుపాకీని చేత పట్టకు తప్పదని చెప్పారు.

అలాగే తుపాకీ రహిత పాఠశాలలను మూసేయాలని పిలుపునిచ్చారు. ఎప్పుడైన ఒక సాయుధవ్యక్తి ఇలానే దాడులకు దిగితే ఆయుధాలు(తుపాకీలు) లేని పాఠశాలలు తమను తాము రక్షించుకోలేవంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అలాగే పాఠశాలలకు సింగిల్‌ పాయింట్‌ ఆఫ్‌ ఎంట్రీ, స్ట్రాంగ్‌ ఫెన్సింగ్‌, మెటల్‌ డిటెక్టర్లు తప్పనిసరిగా ఉండాలని ట్రంప్‌ సూచించారు. అయినా ఉక్రెయిన్‌కి సాయం అందిస్తున్న అమెరికాకు స్కూళ్లల్లో ఈ సౌకర్యాలను కల్పించడం ఏమంతా పెద్ద విషయం కాదని అన్నారు.

(చదవండి: నేపాల్‌లో విమానం మిస్సింగ్‌.. అందులో నలుగురు భారతీయులు)

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top