Volcan de Fuego.. అమెరికాలో అగ్నిపర్వతం బద్ధలైంది. గ్వాటెమాలాలో అగ్నిపర్వతం నుంచి భారీగా బూడిద, పొగ, వేడి లావా వెలువడింది. ఒక్కసారిగా ఆకాశంలోకి ఎగసిపడిన బూడిద మేఘాలు, పేలుళ్ల వంటి శబ్దాలతో అక్కడి వాతావరణం భయానకంగా మారింది. దీంతో సమీపంలో ఉన్న పర్యాటకులు వెంటనే సురక్షిత ప్రాంతాలకు పరుగులు తీశారు.
వివరాల మేరకు.. సెంట్రల్ అమెరికా (Centrel America)లోని గ్వాటెమాలా (Guatemala)లో వోల్కన్ డీఫ్యూగో (Volcan Defugo) అగ్నిపర్వతం బద్ధలైంది. ఈ క్రమంలో అగ్నిపర్వతం నుంచి ఒక్కసారిగా మంటలు వెలువడ్డాయి. ఏకంగా 33 వేల అడుగుల ఎత్తు పొగలు విరజిమ్మాయి. అగ్నిపర్వతం నుంచి ఒక్కసారిగా మంటలు, మండుతున్న రాళ్లు బుల్లెట్లలా దూసుకొచ్చాయి. దాంతో ఆ పర్వత పరిసరాల్లో ఉన్న పర్యాటకులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగులు తీశారు. ఒక్కసారిగా అక్కడ భయానక వాతావరణం నెలకొంది.
#Video 🧗🏽♀️🌋 Circula en redes sociales un video en donde durante el ascenso de un grupo de excursionistas al Volcán de Fuego, en #Guatemala, el coloso registró una erupción repentina que lanzó ceniza, rocas y material volcánico. pic.twitter.com/zhNlXA4lpp
— Canal 13 Oaxaca (@canal13oaxaca) June 22, 2026
ఒక వీడియోలో ఒక పర్యాటకుడు ‘ఓరి దేవుడా, ఇది మరీ దారుణం. పరుగెత్తండి, పరుగెత్తండి..!’ అని అరుస్తూ పరుగులు తీశాడని స్థానికులు తెలిపారు. ఒక పర్యాటకుడు కుక్కను పట్టుకుని సురక్షిత ప్రదేశానికి తీసుకువెళుతుండగా.. మరికొందరు కింద పడుతున్న శిథిలాల నుంచి తమను తాము కాపాడుకోవడానికి ప్రయత్నించినట్లు న్యూయార్క్ పోస్ట్ తెలిపింది. కాగా, గ్వాటెమాల నగరానికి నైరుతి దిశలో సుమారు 43 కిలోమీటర్ల దూరంలో ఈ వోల్కాన్ డి ఫ్యూగో అగ్నిపర్వతం ఉన్నది. గ్వాటెమాలాలో అత్యంత చురుకైన అగ్నిపర్వతంగా ఇది పరిగణించబడుతుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
Guatemala:
Drone footage of the first seconds of the Fuego volcano eruption. pic.twitter.com/ClBvGCrmT7— ((Hurkle Durkling)) 🇺🇸 🤟 🇮🇱 (@durklinghurkle) June 22, 2026
అగ్నిపర్వత కార్యకలాపాలు పెరుగుతున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రమాద ప్రాంతాలకు వెళ్లొద్దని పర్యాటకులకు సూచనలు జారీ చేశారు. పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నామని, అవసరమైతే మరిన్ని భద్రతా చర్యలు చేపడతామని వెల్లడించారు. అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం లేదా గాయాలు సంభవించలేదు. అయితే ప్రకృతి విపత్తులు ఎంత ఆకస్మికంగా సంభవిస్తాయో ఈ ఘటన మరోసారి గుర్తు చేసిందని నిపుణులు పేర్కొంటున్నారు. పర్యాటకుల గుండెల్లో గుబులు పుట్టించిన ఈ ఘటన ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
🌋 Lo que comenzó como una excursión terminó en una carrera por la supervivencia.
Un grupo de senderistas fue sorprendido por una repentina erupción del Volcán de Fuego, en #Guatemala. Las imágenes muestran cómo los excursionistas corren para ponerse a salvo mientras columnas de… pic.twitter.com/mg6LJ0QfBc— GlobaLAT (@globaLATvideo) June 22, 2026


