Ukraine war:భారత్‌కు రుణపడి ఉంటా: పాక్‌ విద్యార్థిని

Student Of Pakistani Thanks To Indian Embassy Rescuing Her From Ukraine - Sakshi

ఉక్రెయిన్‌ నుంచి భారతీయుల తరలింపు దాదాపు ఓ కొలిక్కి వచ్చింది. రాజధాని కీవ్‌, సుమీ లాంటి సమస్యాత్మక ప్రాంతాల నుంచి సైతం విద్యార్థుల్ని తరలించినట్లు అధికారులు ప్రకటించారు.  ఇదిలా ఉండగా.. కీవ్‌లోని భారత రాయబార కార్యాలయం సహకారంతో బయటపడిన పాకిస్థాన్ విద్యార్థిని మాట్లాడిన వీడియో ఒకటి ప్రస్తుతం వైరల్‌ అవుతోంది. 

భారత ప్రభుత్వం, రాయబార కార్యాలయాలనికి, ప్రధాని నరేంద్రమోదీకి థ్యాంక్స్ చెప్పింది ఆస్మా షఫీక్.  ఉక్రెయిన్‌లో తాను ఎదుర్కొన్న అత్యంత క్లిష్టమైన పరిస్థితి నుంచి బయటపడేందుకు తనకు సాయం చేసిన ఇండియన్ ఎంబసీకి, ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ఆమె కృతజ్ఞతలు తెలిపారు.

‘‘చాలా క్లిష్ట పరిస్థితుల్లో చిక్కుకున్న మాకు అన్ని విధాలుగా సాయం చేసిన కీవ్‌లోని భారత రాయాబార కార్యాలయానికి నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అలాగే, భారత ప్రధానికి కూడా. మేం సురక్షితంగా ఇంటికి చేరుకుంటామని ఆశిస్తున్నాం. భారత రాయబార కార్యాలయానికి ధన్యవాదాలు’’ అని ఆ వీడియోలో ఆస్మా పేర్కొంది. ఆస్మా ఇప్పుడు పశ్చిమ ఉక్రెయిన్‌కు వెళ్తోంది. అక్కడి నుంచి ఆమె బయటపడి స్వదేశానికి చేరుకుంటుంది.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top