అమెరికా.. భయం భయం | Ukraine's Operation Spider's Web Attack Explained, Check Out Full Story Inside | Sakshi
Sakshi News home page

Spider Web Attack: అమెరికా.. భయం భయం

Jun 4 2025 9:25 AM | Updated on Jun 4 2025 10:35 AM

Spider Web Attack Explained

వాషింగ్టన్‌: సమఉజ్జీలుగా మాత్రమేకాదు అమెరికా, రష్యాలకు సువిశాల భూభాగం విషయంలోనూ సారూప్యత ఉంది. రష్యాపై ఉక్రెయిన్‌ ‘స్పైడర్‌ వెబ్‌’ డ్రోన్ల దాడి తర్వాత అమెరికాకు ఇదే తరహా ముప్పు పొంచి ఉందన్న వార్తలు ఇప్పుడు అమెరికా పౌరుల భయాందోళనలను పెంచేస్తున్నాయి. అమెరికా సొంత భూభాగంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా మిత్ర దేశాల పరిధిలోని అమెరికా నేవీ, వైమానిక స్థావరాలపై డ్రోన్ల మెరుపుదాడి తప్పదని విశ్లేషణలు వెలువడుతున్నాయి. ‘‘ తమకు ఇలాంటి ముప్పు లేదని అమెరికా రాజకీయ శ్రేణులు, సైనిక వర్గాలు చెప్పడానికి లేదు. 

రష్యా మాదిరే అమెరికా సైతం బుల్లి డ్రోన్ల దాడులను ముందే పసిగట్టడం చాలా కష్టం. వైమానిక స్థావరాల్లోని బాంబర్‌ విమా నాలు బాగా బలిసిన బాతుల్లా అక్కడే తిష్టవే స్తాయి. వీటిని సులభంగా డ్రోన్లతో నాశనంచేయొచ్చు’’ అని గతంలో యుద్ధక్షే త్రాల నుంచి ప్రత్యక్షంగా రిపోర్టింగ్‌ చేసిన మాజీ డిఫెన్స్‌ జర్నలిస్ట్‌ టైలర్‌ రోగోవే వ్యాఖ్యా నించారు. టైలర్‌ ప్రస్తుతం ‘ది వార్‌ జోన్‌’ అనే పత్రికకు ఎడిటర్‌ ఇన్‌ చీఫ్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. సైనిక, భద్రతా వ్యవహా లపైనే ఈ పత్రిక ప్రధానంగా కథనాలు వెలువర్చుతుంది. 

చైనాలో 400.. అమెరికాలో 22
అమెరికాలో యుద్ధవిమానాలకు రక్షణ ఏర్పా ట్లు ఏపాటివో ‘అమెరికా కాంగ్రెషనల్‌’ నివేది కలే స్పష్టంచేస్తున్నాయి. యుద్ధ విమానాలు షెల్టర్‌ల కోసం చైనా ఏకంగా 400 వరకు అత్యంత పటిష్టమైన హ్యాంగర్‌వంటి నిర్మాణా లను పూర్తిచేసింది. కానీ అగ్రరాజ్యంగా చెప్పుకునే అమెరికాలో ఇలాంటివి కేవలం 22 ఉన్నాయి. డ్రోన్లు లోపలిదాకా వచ్చి నేరుగా విమానంపైనా పడకుండా ఇలాంటి నిర్మాణా లు సమర్థవంతంగా అడ్డుకుంటాయి. తైవాన్‌ విషయంలో చైనాతో అమెరికా గగనతల యుద్ధానికి దిగితే చైనా డ్రోన్ల ఆధిపత్యం తప్పదని ఓ నివేదిక పేర్కొంది. 

వ్యూహాత్మక, అంతర్జాతీయ అధ్యయ నాల కేంద్రం(సీఎస్‌ ఐఎస్‌) 2023 నివేదిక ప్రకారం చైనా డ్రోన్లు/ క్షిపణులు అమెరికా విమానాలు గాల్లోకి లేచేలోపే పార్కింగ్‌ స్థలాల్లోనే నాశనంచేసి అక్కడే సమాధి చేస్తా యని ఆ నివేదిక సారాంశం. ‘‘ఇన్నాళ్లూ అన్‌ ఐడెంటిఫైడ్‌ ఫ్లయింగ్‌ ఆబ్జెక్ట్‌ (యూఎఫ్‌ఓ)లుగా పిలుచుకునే వస్తువులు వాస్తవానికి శత్రు నిఘా డ్రోన్లు అయి ఉండొచ్చు. ఇన్నాళ్లూ వాటిని గుర్తు తెలియని ఎగిరే వస్తువులుగా పొరపడ్డారు. దశాబ్దాలుగా ఈ ఎగిరే వస్తువులు చాలా వరకు అమెరికా వ్యూహాత్మక ప్రదేశాలపైనే చక్కర్లు కొట్టడం ఈ వాదనలకు బలం చేకూరుస్తోంది’’ అని  టైలర్‌ రోగోవే అన్నారు.  

Advertisement
 
Advertisement
Advertisement