మహిళను చంపినందుకు గొర్రెకు మూడేళ్లు జైలు శిక్ష!

South Sudan Sentenced Sheep Jail For Three Years Killing A Woman - Sakshi

మన దేశంలో ఎవరైన హత్యలు చేస్తే వారికి శిక్ష పడటానికి చాలా టైం పడుతుంది. ఆధారాలు, సాక్షాలు పక్కాగా ఉండి నేరం రుజువైతే గానీ నిందితుడికి శిక్ష పడదు. ఒకవేళ ప్రమాదవశాత్తు ఏ జంతువు దాడిలోనో మనిషి చనిపోతే పట్టించుకునే వాడే ఉండడు. మహా అయితే సదరు జంతువు యజమాని మంచివాడైతే నష్టపరిహారంగా ఎంతో కొంత ఇస్తేరేమో గానీ ఎక్కువ శాతం మంది తప్పించుకునేందుకే చూస్తారు. కానీ ఇక్కడొక ఆఫ్రికా దేశంలో ఒక జంతువు మనిషిని దాడి చేసి చంపినందుకు మూడేళ్లు జైలు శిక్ష విధించింది.

వివరాల్లోకెళ్తే...దక్షిణ సూడాన్‌లో రామ్‌ అనే గొర్రె 45 ఏళ్ల అదీయు చాపింగ్‌పై దాడి చేసింది. దీంతో ఆమె గాయాలపాలై మరణించింది. ఈ ఘటన రుంబెక్ ఈస్ట్‌లోని అకుయెల్ యోల్ అనే ప్రదేశంలో చోటుచేసుకుంది. స్థానికుల సమాచారంతో పోలీసులు రామ్‌ అనే గొర్రెని అదుపులోకి తీసుకుని అరెస్టు చేయడమే కాకుండా కస్టమరీ కోర్టులో ప్రోడ్యూస్‌ చేశారు. ఈ మేరకు కోర్టు రామ్‌ అనే గొర్రె కి మూడేళ్లు జైలు శిక్ష విధిచింది.

రామ్‌(గొర్రె) యజమాని డుయోని మాన్యాంగ్‌ బాధితురాలి కుటుంబానికి ఐదు ఆవులు అప్పగించాలని తీర్పు ఇచ్చింది. శిక్షలో భాగంగా రామ్‌(గొర్రె) లేక్స్ స్టేట్‌లోని సైనిక శిభిరంలో గడుపుతుందని తెలిపింది. అంతేకాదు శిక్ష ముగింపులో గొర్రెని యజమాని డుయోని కోల్పోయే అవకాశం కూడా ఉందని స్పష్టం చేసింది. అంటే దక్షిణ సూడాన్‌ చట్టాల ప్రకారం ఏదైన జంతువు దాడిలో వ్యక్తి చనిపోతే ఆ జంతువుని శిక్షా కాలం ముగింపులో బాధితుడు కుటుంబానికి పరిహారంగా ఇచ్చేస్తారు.

ఈ మేరకు ఇరు వర్గాలు పోలీసులు సమక్షంలో ఒప్పందం చేసుకున్నారు కూడా. ఇదిలా ఉండగా గొర్రెల దాడిలో వ్యక్తి మృతి చెందడం ఇదేం తొలిసారి కాదు. గతేడాది కూడా అమెరికాలో ఓ మహిళ పొలంలో గొర్రెల దాడికి గురై మరణించింది.

(చదవండి: సౌదీ ఏవియేషన్‌ చరిత్రలో తొలిసారి..)

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top