లిథియం బ్యాటరీ ఫ్యాక్టరీలో పేలుడు | South Korea factory fire kills more than 20 workers | Sakshi
Sakshi News home page

లిథియం బ్యాటరీ ఫ్యాక్టరీలో పేలుడు

Published Tue, Jun 25 2024 6:09 AM | Last Updated on Tue, Jun 25 2024 6:09 AM

South Korea factory fire kills more than 20 workers

దక్షిణ కొరియాలో 22 మంది కార్మికుల దుర్మరణం 

సియోల్‌: దక్షిణ కొరియాలోని లిథియం బ్యాటరీ తయారీ కర్మాగారంలో జరిగిన అగ్నిప్రమాదంలో 22 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. ఎనిమిది మంది గాయపడ్డారు. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం దేశరాజధాని సియోల్‌ దగ్గర్లోని హవాసియాంగ్‌ సిటీలో ఎరీసెల్‌ కంపెనీకి చెందిన లిథియం బ్యాటరీ ఫ్యాక్టరీ ఉంది. 

సోమవారం ఉదయం 10.30గంటలపుడు 102 మంది కార్మికులు పనిచేస్తున్న సమయంలో అక్కడి కొన్ని బ్యాటరీలు పేలాయి. దీంతో రెండో అంతస్తుల్లో మంటలంటుకుని ఫ్యాక్టరీలో దావానంలా వ్యాపించాయి. దీంతో 22 మంది అగి్నకి ఆహుతయ్యారు. వీరిలో 18 మంది చైనా కార్మికులు ఉన్నారు. తయారైన బ్యాటరీలను తనిఖీచేసి ప్యాక్‌ చేస్తుండగా ఈ ఘటన జరిగిందని తెలుస్తోంది. అయితే పేలుడుకు ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అని అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా ఒకరి జాడ తెలీడంలేదు. ఘటనాస్థలిని ప్రధాని హాన్‌ డ్యూక్‌ సో సందర్శించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement