మాస్‌ ఎంట్రీ.. చైనాలో పుతిన్‌కు గ్రాండ్‌ వెల్‌కమ్‌! | Russian President Vladimir Putin Arrives In China | Sakshi
Sakshi News home page

చైనా పర్యటనకు పుతిన్‌.. ఉక్రెయిన్‌పై కీలక వ్యాఖ్యలు

Published Thu, May 16 2024 8:14 AM | Last Updated on Thu, May 16 2024 9:25 AM

Russian President Vladimir Putin Arrives In China

బీజింగ్‌: రెండు రోజుల పర్యటనలో భాగంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ చైనాకు చేరుకున్నారు. పుతిన్‌ పర్యటనలో భాగంగా చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో కీలక చర్చల్లో పాల్గొననున్నారు.

ముఖ్యంగా ఉక్రెయిన్‌పై యుద్ధం గురించి చర్చించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే, రష్యా ఆర్థికంగా బలపడేందుకు కొన్ని నిర్ణయాలు కూడా తీసుకోనున్నట్టు సమాచారం. ఇక, ఉక్రెయిన్‌పై యుద్ధం కారణంగా రష్యాపై పశ్చిమ దేశాలు తీవ్ర ఆంక్షలు విధించడంతో క్రెమ్లిన్‌ ఆర్థిక పరిస్థితి దెబ్బతిన్న విషయం తెలిసిందే. దీంతో, పుతిన్‌ దిద్దుబాటు చర్యలకు ప్లాన్‌ చేస్తున్నారు.

కాగా, రష్యా అధ్యక్షుడు పుతిన్‌ గురువారం తెల్లవారుజామునే చైనాకు చేరుకున్నారు. ఈ సందర్భంగా చైనాలో పుతిన్‌కు ఘన స్వాగతం లభించింది. రష్యాకు మరోసారి అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత పుతిన్‌ తొలి విదేశీ పర్యటన ఇదే కావడం విశేషం. కాగా.. జిన్‌పింగ్‌, పుతిన్‌ భేటీ రెండు దేశాల మధ్య సంబంధాలను మరో లెవల్‌కు తీసుకువెళ్తుందని ఇండిపెండెంట్‌ రష్యాన్‌ పొలిటికల్‌ అనలిస్ట్‌ కొస్టానియన్‌ కల్చేవ్‌ చెప్పుకొచ్చారు. అలాగే, ఇద్దరు నేతల మధ్య 2022 నుంచి మంచి సత్సంబంధాలు కొనసాగుతున్నాయని తెలిపారు. 

 



ఇదిలా ఉండగా.. చైనా పర్యటన నేపథ్యంలో పుతిన్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్‌తో యుద్ధంపై చర్చలు జరిపేందుకు తాము సిద్ధంగానే ఉన్నామని పుతిన్‌ అన్నారు. యుద్ధం గురించి చర్చలు జరిపేందుకు మేమెప్పుడూ నిరాకరించలేదు. ప్రస్తుత ఘర్షణకు శాంతియుత మార్గాల్లో సమగ్ర, సుస్థిర పరిష్కారాన్ని మేం కోరుకుంటున్నాం. ఉక్రెయిన్‌ విషయంపై సంప్రదింపులకు మేం సిద్ధం. కానీ ఆ చర్చల్లో మాతో సహా అన్ని భాగస్వామ్య దేశాల ప్రయోజనాలను తప్పనిసరిగా పరిగణనలోకి తీసుకోవాలి అని కామెంట్స్‌ చేశారు.

 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement