కోర్టు బోనెక్కి సాక్ష్యం చెప్పనున్న ప్రిన్స్‌ హ్యారీ

Prince Harry to be first British royal to testify in court in 130 years - Sakshi

లండన్‌: బ్రిటన్‌ రాజు చార్లెస్‌ –3 చిన్న కుమారుడు ప్రిన్స్‌ హ్యారీ సాక్ష్యం ఇవ్వడానికి వచ్చే వారంలో కోర్టుకు హాజరుకానున్నారు. రాజకుటుంబానికి చెందినవారు ఇలా కోర్టు బోనెక్కడం 130 ఏళ్లలో ఇది తొలిసారి.

డైలీ మిర్రర్, సండే మిర్రర్‌ వంటి వార్తా పత్రికల ప్రచురణ సంస్థ మిర్రర్‌ గ్రూప్‌ న్యూస్‌పేపర్స్‌ (ఎంజీఎన్‌) సెలిబ్రిటీల వ్యక్తిగత అంశాలను సేకరించడం కోసం చట్ట విరుద్ధంగా ఫోన్‌ ట్యాపింగ్‌కు పాల్పడిందన్న ఆరోపణలున్నాయి. ఈ ఆరోపణలపై 100 మంది సెలిబ్రిటీలతో పాటు ప్రిన్స్‌ హ్యారీ కూడా మిర్రర్‌ గ్రూప్‌పై కోర్టులో పిటిషన్‌ వేశారు. ఈ కేసును విచారిస్తున్న లండన్‌ హైకోర్టులో ప్రిన్స్‌ హ్యారీ హాజరై  ఫోన్‌ ట్యాంపింగ్‌పై సాక్ష్యం ఇవ్వనున్నారు.  గతంలో 1870లో ఎడ్వర్డ్‌–7  ఒక విడాకుల కేసులో సాక్ష్యమిచ్చారు. 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top