వెయ్యి ఏళ్ల నాటి మసీదు సందర్శించిన మోదీ.. ప్రత్యేకత ఏంటంటే..

PM Narendra Modi Visits 11th Century Al Hakim Mosque  - Sakshi

ఈజిప్టు: భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈజిప్టు పర్యటనలో భాగంగా రెండో రోజున 11వ శతాబ్దానికి చెందిన చారిత్రాత్మక అల్-హకీమ్ మసీదును సందర్శించారు. ఈజిప్టులో ప్రఖ్యాతి గాంచిన ఈ అల్-హకీమ్ మసీదు 11వ శతాబ్దంలో నిర్మించారు. 1000 ఏళ్ల నాటి ఈ మసీదుకు ఈజిప్టులో చారిత్రాత్మకంగానూ, సాంస్కృతికంగానూ ఎంతో ప్రత్యేకత ఉంది.

ఇది భారత్, ఈజిప్టు రెండు దేశాల సంస్కృతి, సాంప్రదాయాలకు నిలువెత్తు రూపమని చెబుతూ ఉంటారు. భారత సంతతికి చెందిన దావూదీ బోహ్రా సంఘం వారు దీనిని పునరుద్ధరించారు. ఈ సంఘం వారు బీజేపీ ఓటు బ్యాంకును ప్రభావితం చేయగలరని చెబుతూ ఉంటారు. 

ప్రధాని మసీదు సందర్శన సందర్బంగా దావూదీ బోహ్రా సంఘంలోని సభ్యుడు శుజావుద్దీన్ షబ్బీర్ తంబావాలా మాట్లాడుతూ.. ఈరోజు నిజంగా చారిత్రాత్మకమైనది. భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇక్కడికి రావడం.. మాతోనూ, మా సంఘంతోనూ మాట్లాడటం.. మమ్మల్ని వారి కుటుంబసభ్యుల్లా భావించి మా యోగక్షేమాలను అడిగి తెలుసుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. 

అనంతరం హీలియోపోలీస్ యుద్ధ స్మశానవాటికను సందర్శించి మొదటి ప్రపంచ యుద్ధంలో ఈజిప్టు, పాలస్తీనా తరపున యుద్ధం చేసి మరణించిన సుమారు 4000 మంది భారత సైనికులకు నివాళులర్పించారు.      

ఇది కూడా చదవండి: వాళ్ళే అసలైన హీరోలు.. వీళ్లంతా పిరికిపందలు
   

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top