తిరుగుబాటు సైన్యంపై ప్రశంసల వర్షం కురిపిస్తోన్న స్థానికులు..  

Rostov Locals Calls Police Traitors  - Sakshi

మాస్కో: రష్యాలో తిరుగుబాటు విషయమై బెలారస్ అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకాశెంకో జరిపిన మధ్యవర్తిత్వం ఫలించడంతో వాగ్నర్ బలగాలు తమ స్థావరాలకు తిరుగు ప్రయాణమయ్యాయి. రొస్తోవ్ ప్రజానీకం వారికి ఘనంగా వీడ్కోలు పలికారు. ఈ సందర్బంగా స్థానికులు తిరిగి వెళ్తోన్న వాగ్నర్ సైన్యాన్ని హీరోలుగానూ స్థానిక పోలీసులను పిరికిపందలగానూ, దొంగలుగానూ అభివర్ణించారు. 

ప్రిగోజిన్ బృందాలు రష్యాను వీడి వెళ్తోన్న వీడియోలు సోషల్ మీడియాలో రాగానే రొస్తోవ్లోని జనం రోడ్డు మీదకు వచ్చి తమ  అభిప్రాయాలను వెల్లడించారు. రష్యా సైన్యం తీరు మొదటి నుంచీ తప్పులతడకగానే ఉందని వాగ్నర్ గ్రూపుపై వారి ఆధిపత్యం సహించలేకే వారు తిరుగుబాటు చేశారని అన్నారు. 

బఖ్ ముత్ లోనూ ఇతర చోట్ల ఏం జరిగిందో మీరు చూశారు. ఉక్రెయిన్ బలగాలు తీవ్రంగా ప్రతిఘటించడంతో మన సైనికులు వేల సంఖ్యలో చనిపోయారు. రష్యా సైన్యం వారికి తగినన్ని ఆయుధాలు పంపలేదని, మనవాళ్ళే మనం గెలవకుండా అడ్డుకున్నారని ఇక్కడివారు చెబుతున్నారు.   

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పెంచి పోషించిన కిరాయి సైన్యం ఆయనపైనే తిరుగుబాటు చేసి ప్రిగోజిన్ నాయకత్వంలో మాస్కోకు వస్తున్నామని చెప్పగానే రష్యా సైన్యం భయపడిందని.. వాగ్నర్ సైనికులే అసలైన హీరోలని.. వారికి భయపడి పారిపోయిన ఇక్కడి పోలీసులు పిరికిపందలు, దొంగలని అన్నారు.    

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top