
బీజింగ్: భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ బీజింగ్‌లో చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌ను కలుసుకుని, భారత్-చైనాల మధ్య సంబంధాలపై చర్చించారు. 2020లో భారత్- చైనా మధ్య సంబంధాలు దెబ్బతిన్న తర్వాత జైశంకర్ మంగళవారం తొలిసారి చైనాలో పర్యటించారు.
జిన్‌పింగ్‌తో సమావేశానికి సంబంధించిన ఒక ఫొటోను జైశంకర్ ‘ఎక్స్’లో పంచుకుంటూ, భారత్- చైనా ద్వైపాక్షిక సంబంధాలలో పురోగతిపై జిన్‌పింగ్‌తో మాట్లాడానని, దీనిపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలియజేశారని తెలిపారు. జిన్‌పింగ్‌ను జైశంకర్ కలిసినప్పుడు ఆయనతోపాటు ఎస్‌సీఓ సభ్య దేశాల ప్రతినిధులు కూడా ఉన్నారు. 2020లో వాస్తవ నియంత్రణ రేఖ (ఎల్‌ఏసీ) వెంబడి గాల్వాన్ లోయలో తలెత్తిన ఘర్షణల కారణంగా సరిహద్దు ఉద్రిక్తతలు తలెత్తాయి.
Called on President Xi Jinping this morning in Beijing along with my fellow SCO Foreign Ministers.
Conveyed the greetings of President Droupadi Murmu & Prime Minister @narendramodi.
Apprised President Xi of the recent development of our bilateral ties. Value the guidance of… pic.twitter.com/tNfmEzpJGl— Dr. S. Jaishankar (@DrSJaishankar) July 15, 2025
జైశంకర్ బీజింగ్‌లో చైనా ఉపాధ్యక్షుడు హాన్ జెంగ్‌ను కలుసుకున్నారు. భారత్- చైనాల మధ్య చర్చలు జరగాలని కోరారు. గత సంవత్సరం అక్టోబర్ నుంచి భారత్- చైనాల మధ్య సంబంధాలు గణనీయంగా మెరుగుపడుతూ వస్తున్నాయి. 2024 అక్టోబర్‌లో కజాన్‌లో ప్రధాని మోదీ చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో సమావేశమయ్యారు. అనంతరం లడఖ్‌లోని డెప్సాంగ్, డెమ్‌చోక్‌లలో సైన్యాన్ని ఉపసంహరించుకునే ప్రణాళికను భారత్-చైనాలు ప్రకటించాయి.