
వాషింగ్టన్ డీసీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోమారు భారత్- పాక్‌ల మధ్య మధ్యవర్తిత్వం వహించానని వాదించారు. తన చొరవతో రెండు దేశాల మధ్య నాలుగు రోజుల పాటు సాగిన ఘర్షణను ఆపానని పేర్కొన్నారు. ‘యుద్ధాలను పరిష్కరించడంలో మేము విజయవంతం అయ్యాం. ఈ జాబితాలో భారత్- పాకిస్తాన్ ఉన్నాయి. ఇవి నాడు మరో వారంలోనే అణు యుద్ధనికి దిగేవి, అది చాలా ఘోరంగా జరిగివుండేది. దానిని మేము ఆపాం’ అని ట్రంప్ పేర్కొన్నారు.
#WATCH | US President Donald Trump says, "We have been very successful in settling wars. You have India, Pakistan...India and Pakistan would have been a nuclear war within another week, the way that was going. That was going very badly. We did that through trade. I said, we're… pic.twitter.com/GPDA6ObK0B
— ANI (@ANI) July 15, 2025
వాణిజ్యాన్ని పరపతిగా ఉపయోగించుకుని, తన వ్యూహాన్ని అమలు చేశానని.. సంఘర్షణను పరిష్కరించే వరకు మీతో వాణిజ్యం గురించి మాట్లాడబోమని చెప్పడంతో భారత్- పాక్ మధ్య యుద్ధం ముగిసిందని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఇదేవిధంగా ట్రంప్ గత జూన్‌లో విలేకరులతో మాట్లాడుతూ భారత్- పాకిస్తాన్ మధ్య తలెత్తబోయే అణు యుద్ధాన్ని పరిష్కరించానని పేర్కొన్నారు. తాను పాకిస్తాన్, భారత్‌లతో మాట్లాడానని, అక్కడి నేతలు అణ్వాయుధాలతో దాడి చేసుకోగలిగే సమర్థత కలిగినవారని ట్రంప్ పేర్కొన్నారు.
అయితే అమెరికా అధ్యక్షుడు చేసిన వాదనలను భారతదేశం ఇంతకుముందే తోసిపుచ్చింది. ఆపరేషన్ సిందూర్ ప్రారంభమైనప్పటి నుండి కాల్పుల విరమణ, సైనిక చర్యపై అవగాహన కుదిరే వరకు భారత్- అమెరికా నేతల మధ్య సంభాషణలు జరిగాయని, దేనిలోనూ ఇటువంటి మధ్యవర్తిత్వ ప్రస్తావన లేదని భారత్ స్పష్టం చేసింది. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతిస్పందనగా భారత్ మే 7న పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్‌లోని ఉగ్రవాద మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని ‘ఆపరేషన్ సిందూర్’ చేపట్టింది.