విమానంలో పావురం | Pigeon flies into US flight cabin | Sakshi
Sakshi News home page

విమానంలో పావురం

May 29 2025 3:09 AM | Updated on May 29 2025 3:09 AM

Pigeon flies into US flight cabin

సెయింట్‌పాల్‌ (యూఎస్‌): ఎగురుతున్న విమానంలోకి ఓ పావురం ఎగిరొచ్చి ప్రయాణికులను గాభరా పెట్టింది. ఈ ఉదంతం మంగళవారం అమెరికాలో చోటుచేసుకుంది. డెల్టా ఎయిర్‌లైన్స్‌ విమానం మిన్నెపొలిస్‌–సెయింట్‌ పాల్‌ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి విస్కాన్సిన్‌లోని మాడిసన్‌కు బయలుదేరింది. మార్గమధ్యంలో ఉండగా విమానం క్యాబిన్‌లోకి ఓ పావురం ఎగురుతూ రావడంతో గందరగోళం ఏర్పడింది. 

ఓ ప్రయాణికుడు దాన్ని పట్టుకునే ప్రయత్నం చేయగా తప్పించుకుంది. దానికి సంబంధించిన వీడియో వైరల్‌ అవుతోంది. నిజానికి జరిగిందేమిటంటే టేకాఫ్‌కు ముందే రెండు పావురాలు విమానం లోపలికి వచ్చాయి. సిబ్బంది ఒక పావురాన్నే గమనించి బయటికి పంపారు. రెండోది విమానంలోనే ఉండిపోయింది. అదే మార్గమధ్యంలో గందరగోళానికి కారణమైంది. 

Advertisement
 
Advertisement
Advertisement