బాల్య వివాహ నిషేధ చట్టం తెచ్చిన పాక్‌ | Pakistan Introduces Law For Banning Child Marriages, More Details Inside | Sakshi
Sakshi News home page

బాల్య వివాహ నిషేధ చట్టం తెచ్చిన పాక్‌

May 31 2025 4:13 AM | Updated on May 31 2025 1:30 PM

Pakistan introduces law banning child marriage

ఇస్లామాబాద్‌: పాకిస్తాన్‌ బాల్య వివాహాల నిషేధ చట్టాన్ని తీసుకువచ్చింది. అధ్యక్షుడు అసిఫ్‌ అలీ జర్దారీ శుక్రవారం ఇందుకు సంబంధించిన బిల్లుపై సంతకం చేశారు. పాకిస్తాన్‌లో ఇకపై 18 ఏళ్ల లోపు బాలబాలికలకు వివాహం చేయడం చట్ట విరుద్ధం. ‘ఇస్లామాబాద్‌ కేపిటల్‌ టెర్రిటరీ చైల్డ్‌ మ్యారేజీ రిస్ట్రెయింట్‌ బిల్లు’ను పార్లమెంట్‌లోని ఉభయసభలు ఈ నెల 27వ తేదీన ఆమోదించాయి. బిల్లుపై అధ్యక్షుడు జర్దారీ సంతకం చేసిన విషయాన్ని పాకిస్తాన్‌ పీపుల్స్‌ పార్టీ(పీపీపీ)సెనేటర్‌ షెర్రీ రెహ్మాన్‌ ‘ఎక్స్‌’లో ప్రకటించారు. 

‘బాల్య వివాహాలకు వ్యతిరేకంగా ముఖ్యమైన చట్టాన్ని రూపొందించడంలో పాకిస్తాన్‌ ఒక మైలురాయిని అధిగమించింది’అని ఆమె పేర్కొన్నారు. అయితే, మత సంస్థలతోపాటు ఇస్లామిక్‌ చట్టాలకు భాష్యం చెప్పే కౌన్సిల్‌ ఆఫ్‌ ఇస్లామిక్‌ ఐడియాలజీ(సీఐఐ)సైతం ఈ చట్టాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. 18 ఏళ్లలోపు వివాహాన్ని అత్యాచారంగా పరిగణించడం ఇస్లామిక్‌ చట్టాలకు వ్యతిరేకమని సీఐఐ వాదిస్తోంది. సమాజంలో అరాచకాన్ని నిరోధించాలంటే అధ్యక్షుడు జర్దారీ ఈ బిల్లుపై సంతకం చేయరాదని సీఐఐ సభ్యుడు మౌలానా జలాలుద్దీన్‌ అంతకుముందు వ్యాఖ్యానించారు.

Advertisement
 
Advertisement
Advertisement