Video: మొబైల్‌ చూస్తూ ట్రైన్‌ నడిపిన మహిళ.. తరువాత ఏం జరిగిందో చూడండి!

Old Video Shows Woman Using Smartphone While Driving Train - Sakshi

ఇటీవల కాలంలో ఫోన్‌ అదరి జీవితాల్లోఓ భాగం అయిపోయింది.  చుట్టూ నలుగురు ఉండాలి అనుకునే వాళ్ళను సైతం ఫోన్‌ వుంటే చాలు ఇంకేం మద్దు అనేలా మార్చేసింది. మొబైల్‌ లేకపోతే ఏదో కోల్పోయామనే ఫీలింగ్‌.చిన్నా పెద్దా తేడా లేకుండా ఇప్పుడు అందరూ ఇదే బాటపడుతున్నారు. ఖాళీ సమయాల్లోనే కాదు. పనివేళల్లో కూడా ఫోన్‌ చూస్తూ టైంపాస్‌ చేస్తున్నారు. ముఖ్యంగా ప్రయాణ సమయాల్లో నిర్లక్ష్యంగా ఫోన్‌ వాడకం కారణంగా కొన్నిసార్లు ప్రమాదాలకు కొని తెచ్చుకున్నవారు అవుతున్నారు.

అచ్చం అలాంటి ఓ భయంకరమైన ఘటనే రష్యాలో చోటుచేసుకుంది. ఓ మహిళా డ్రైవర్‌(లోకో పైలట్‌) రైలు నడుపుతూ ఫోన్‌ చూస్తూ ఉంది. అందులోని వీడియోలు చూస్తూ కాలక్షేపం చేస్తుంది. ఇంతలో ట్రైక్‌పై మరో రైలు ఆగి ఉంది.మహిళ ఫోన్‌లో బిజీగా ఉండడంతో ముందు రైలు ఉన్న విషయం గుర్తించలేదు. తీరా దగ్గరికి వచ్చాక గమనించింది. ఎదురుగా రైలు సి బ్రేకులు వేసేందుకు ప్రయత్నించినా.. అప్పటికే సమీపానికి చేరుకోవడంతో సాధ్యం కాలేదు.

రైలు నేరుగా వెళ్లి ఆగి ఉన్న రైలును ఢీకొంది. దీంతో ప్రయాణికులంతా ఒక్కసారిగా సీట్లలో నుంచి ఎగిరి ముందు పక్కన పడ్డారు. అయితే రైలుకు సేఫ్టీ ఎక్విప్‌మెంట్ ఉండడంతో ప్రాణనష్టం జరగలేదు. ఈ ఘటనలో చాలా మంది తీవ్రంగా గాయపడ్డట్లు తెలిసింది.  ఈ దృశ్యాలన్నీ రైలులోని సీసీటీవీ ఫుటేజీలోరికార్డ‍య్యాయి. అయితే రైలులో ఎక్కువ ప్రయాణికులు లేకపోవడం వల్ల పెను ప్రమాదం తప్పింది.
చదవండి: బ్రిడ్జిపై పేలిన ఆయిల్ ట్యాంకర్.. వీడియో వైరల్..

కాగా ఈఘటన 2019 అక్టోబర్‌లో రష్యాలో చోటుచేసుకుంది. తాజాగా సీసీటీవీ ఇడియట్స్‌’ అనే ట్విటర్‌ పేజ్‌ షేర్‌ చేయడంతో మరోసారి వైరల్‌గా మారింది. ఇప్పటికే ఈ వీడియోను 10 మిలియన్ల మంది చూశారు. అయితే మహిళా డ్రైవింగ్‌పై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక్కరి నిర్లక్ష్యం కారణంగా ఎంతోమంది ప్రాణాలకు ప్రమాదం కలుగుతుందనే విషయం ఈ వీడియో ద్వారా స్పష్టంగా తెలుస్తోందని కామెంట్‌ చేస్తున్నారు. 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top