భారత్‌కు అప్పగించొద్దు.. నీరవ్‌ మోదీ పిటిషన్‌

Nirav Modi Files Appeal UK High Court Challenge Extradition India - Sakshi

లండన్‌: భారత్‌  తిరిగి రాకుండా ఉండేందుకు వజ్రాల వ్యాపారి నీరవ్‌ మోదీ శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. అతడిని భారత్‌కు అప్పగించాలని ఫిబ్రవరి 25న యూకే కోర్టు తీర్పు ఇచ్చింది.  అదే క్రమంలో ఆ దేశ హోంమంత్రిత్వ శాఖ కూడా ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే.  అయితే ఇందుకు అడ్డుపడే క్రమంలో  ప్రస్తుతం కింది కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్‌ చేసేందుకు అనుమతి కోసం ప్రయత్నిస్తున్నాడు. అందుకోసం ఆయన మరోసారి యూకే హైకోర్టులో తాజాగా పిటిషన్‌ కూడా దాఖలు చేశారు. పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ను దాదాపు రూ. 14వేల కోట్ల మోసం కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న నీరవ్‌ మోదీ భారత్‌కు తిరిగి రాకుండా ఉండేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. 

భారత్‌కు అప్పగించొద్దు...
నీరవ్‌ మోదీ కోర్టులో..  భారత్‌లో తనకు న్యాయం జరగదని, తన మానసిక స్థితి సరిగా లేదంటూ బ్రిటన్‌ కోర్టుకు విన్నవించారు. అయితే, ఆయన చేసిన వాదనలను అక్కడి కోర్టు తోసిపుచ్చింది. మనీలాండరింగ్‌ కేసులో భారత్‌ సమర్పించిన ఆధారాలు పరీశిలించామని, తప్పు చేసినట్లు రుజువులు ఉన్నాయని.. కనుక అతడిని అప్పగించాలంటూ ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో కోర్టు తీర్పునిచ్చింది. ఆపై యూకే హోంమంత్రిత్వశాఖ కూడా ఇందుకు అంగీకారం తెలిపింది. ప్రస్తుతం భారత్‌కు రాకుండా ఉండడానికి తాజాగా మరో ప్రయత్నంగా యూకే హైకోర్టులో  పిటీషన్‌ దాఖలు చేశాడు.

తప్పుడు ఎల్‌వోయూలతో పీఎన్‌బీని నీరవ్‌ మోదీ మోసగించిన వ్యవహారం 2018 జనవరిలో బయటపడింది. అయితే అప్పటికే అతడు దేశం విడిచి పారిపోయారు. 2018 డిసెంబర్‌లో నీరవ్‌ తమ దేశంలోనే నివసిస్తున్నాడని బ్రిటన్‌ ప్రభుత్వం భారత్‌కు తెలియజేసింది. దీంతో అతడిని అప్పగించాలని భారత్‌ విజ్ఞప్తి చేసింది. ఈ క్రమంలో 2019 మార్చిలో నీరవ్‌ను అక్కడి పోలీసులు అరెస్ట్‌ చేశారు. అప్పటి నుంచి అక్కడి వాండ్స్‌వర్త్‌ జైల్లో నీరవ్‌ ఉంటున్నాడు. తనకు బెయిల్‌ మంజూరు చేయాలని పలుమార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ బ్రిటన్‌ కోర్టు తిరస్కరిస్తూ వచ్చింది. 

( చదవండి: బిల్‌ గేట్స్‌: వ్యాక్సిన్‌ ఫార్ములాను భారత్‌కు ఇవ్వద్దు

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top