దేశపు యువరాణి ట్రంప్‌ను వెక్కిరించింది?!.. వీడియో వైరల్ | Netherlands Queen Maxima mock US President Donald Trump | Sakshi
Sakshi News home page

Donald Trump: దేశపు యువరాణి ట్రంప్‌ను వెక్కిరించింది?!.. వీడియో వైరల్

Jun 26 2025 7:27 PM | Updated on Jun 26 2025 8:08 PM

Netherlands Queen Maxima mock US President Donald Trump

ఆమ్‌స్టర్‌డ్యామ్: అధికారిక పర్యటనలో భాగంగా నెదర్లాండ్‌ వెళ్లిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ను (Donald Trump) ఆ దేశపు క్వీన్‌ మాక్సిమా (Queen Maxima) వెక్కిరించారు. అందుకు సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.  

ఇటీవల నెదర్లాండ్స్‌ (Netherlands)లో నాటో సమ్మిట్ జరింగింది. ఆ సమ్మిట్‌కు డొనాల్డ్‌ ట్రంప్‌ హాజరయ్యారు. అక్కడ రాజకీయ అతిథిగా హుయిస్ టెన్ బోష్ అనే రాయల్‌ ప్యాలెస్‌లో కింగ్ విలెం అలెగ్జాండర్, క్వీన్ మాక్సిమా అతిథిలుగా వచ్చారు. అక్కడ జరిగిన అధికారిక ఫోటోషూట్ సమయంలో ట్రంప్ మాట్లాడిన తరవాత, క్వీన్ మాక్సిమా అతని ముఖభావాలను అనుకరించినట్లు కనిపించింది. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. కొంతమంది ఇది ఉద్దేశపూర్వకంగా చేశారని భావించగా, మరికొంతమంది మాత్రం ఇది యాదృచ్ఛికంగా జరిగిందని అంటున్నారు. ఇది నిజంగా ట్రంప్‌ను వెక్కిరించారా? లేక కేవలం సరదాగా జరిగిన సంఘటనా అన్నది ఇప్పటికీ చర్చనీయాంశంగా మారింది. 

 

Advertisement
 
Advertisement
Advertisement