
ఇస్లాంబుల్: తుర్కియే పశ్చిమప్రాంతాన్ని శక్తివంతమైన భూకంపం సంభవించింది. ఆదివారం రాత్రి 8 గంటల సమయంలో సంభవించిన భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.0గా నమోదైంది.
ఇస్లాంబుల్‌కు 206 కిలోమీటర్ల దూరంలో భూమిలో సుమారు 11 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉంది. ఇస్లాంబుల్, చుట్టుపక్కల ప్రాంతాలతోపాటు ప్రముఖ పర్యాటక ప్రాంతం ఇజి్మర్‌లోనూ దీని ప్రభావంతో ప్రకంపనలు సంభవించాయి. షిండిర్గిలో ఒక భవనం కూలినట్లు సమాచారం. ప్రాణ, ఆస్తి నష్టానికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది. తుర్కియే తరచూ భూకంపాల ప్రభావానికి గురవుతోంది.
